టీకాతోనే చిన్నారులకు రక్ష

ABN , First Publish Date - 2022-03-17T04:27:23+05:30 IST

కరోనా బారిన పడకుండా ఉండాలంటే చిన్నారులకు టీకానే రక్ష అని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.

టీకాతోనే చిన్నారులకు రక్ష
నస్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు కరోనా టీకా వేస్తున్న సిబ్బంది

= కలెక్టర్‌ భారతి హోళికేరి
మందమర్రిటౌన్‌, మార్చి 16 : కరోనా బారిన పడకుండా ఉండాలంటే చిన్నారులకు టీకానే రక్ష అని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.  పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో 12-14 సంవత్సరాల పిల్లలకు బుధవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రాణాలను ఏ విధంగా హరించి వేసిందో అందరికి తెలుసన్నారు. టీకా వేసుకోవడం ద్వారా చాలా మంది ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉన్నారని తెలిపారు. తల్లిదండ్రులందరు పిల్లలకు వ్యాక్సిన్‌వేయించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు శైలజ, ఏఎన్‌ఎం శంకరమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నస్పూర్‌: నస్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు పిల్లలకు కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించారు. తొలి రోజున ఐదుగురు పిల్లలకు టీకాను ఇచ్చారు. అనంతరం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి లక్ష్య సాధనకు కృషి చేసిన ఏఎన్‌ఎం వజ్రతో పాటు ఇద్దరు ఆశా వర్కర్లను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జ్యోతి, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌,  నస్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు అర్చన, సూపర్‌ వైజర్‌ దత్తారాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి: పట్టణంలోని శంషీర్‌నగర్‌లోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో 12-14 సంవత్సరాల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వేమనపల్లి: మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించినట్లు వైద్యుడు కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మయ్య, హెల్త్‌ అసిస్టెంట్‌ బాపు, ఈసీ మధు, పంచాయతీ కార్యదర్శి శ్యాంచంద్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
దండేపల్లి: 12ఏళ్లు నుంచి 14 ఏళ్లు పిల్లలకు కరోనా వైరస్‌ నివారణ కోసం కొవిడ్‌ టీకాలను తప్పకుండా వేయించాలని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ అన్నారు. దండేపల్లి, తాళ్ళపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం పిల్లల కరోనా టికాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, వైద్య సిబ్బందిచే పిల్లలకు కరోనా టికాలు వేయించారు. కార్యక్రమంలో వైద్యులు ప్రసద్‌రావు, హరీష్‌, ఎంపిటిసి ముత్తె రాజన్న , సర్పంచు కళావతి, ఉప సర్పంచు పుట్టపాక తిరుపతి, మాజీ వైస్‌ ఎంపీపీ ఆకుల రాజేందర్‌ పాల్గొన్నారు.
కోటపల్లి: కొవిడ్‌ నివారణ కోసం 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ను వైద్యాధికారి సత్యనారాయణ ప్రారం భించారు. పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.  సూపర్‌ వైజర్‌లు జ్యోతి, శోభ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
నెన్నెల: పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సయ్యద్‌ జుబేర్‌ హుస్సేన్‌ తెలిపారు. అనంతరం జాతీయ వ్యాక్సినేషన్‌ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉత్తమ సేవలందించిన ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, సూపర్‌వైజర్‌ యశోద,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T04:27:23+05:30 IST