ఉప్పలచెలకలో పులి పాదముద్రల గుర్తింపు

ABN , First Publish Date - 2022-03-01T18:36:35+05:30 IST

మండలంలో గత నెల రోజులుగా పెద్దపులి సంచారం, అడుగు జాడల గుర్తింపు కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉప్పలచెలక అడవుల్లో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే

ఉప్పలచెలకలో పులి పాదముద్రల గుర్తింపు

పెనుబల్లిరూరల్‌(ఖమ్మం): మండలంలో గత నెల రోజులుగా పెద్దపులి సంచారం, అడుగు జాడల గుర్తింపు కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉప్పలచెలక అడవుల్లో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు సత్తుపల్లి డివిజన్‌లో ఏ ప్రాణికి పులి హాని తలపెట్టినట్లు గుర్తించలేదని, అదేవిధంగా పెద్దపులికి హాని చేయోద్దని సూచించారు. గేదెలు, మేకల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, సంచారం గమనించిన వారు సమాచారం ఇవ్వాలని సూచించారు.


Updated Date - 2022-03-01T18:36:35+05:30 IST