విద్యుదాఘాతంతో ఇద్దరు ప్రేమికులకు గాయాలు

ABN , First Publish Date - 2022-12-07T00:00:31+05:30 IST

ఇంట్లో పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఓ యువతి ఆమె బావతో పారిపోతుండగా కరెంటు షాక్‌ తగలి ఇద్దరూ గాయపడ్డ ఘటన మండలంలోని వాయిపేట్‌లో చోటు చేసుకుంది.

విద్యుదాఘాతంతో ఇద్దరు ప్రేమికులకు గాయాలు

సిరికొండ, డిసెంబరు 6: ఇంట్లో పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఓ యువతి ఆమె బావతో పారిపోతుండగా కరెంటు షాక్‌ తగలి ఇద్దరూ గాయపడ్డ ఘటన మండలంలోని వాయిపేట్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాయిపేట్‌ గ్రామానికి చెందిన యువతి, పోచంపల్లి గ్రా మానికి చెందిన పట్టెపు గంగాధర్‌ బావమరదళ్లు. వీరు కొన్నాళ్లుగా ప్రేమించు కుంటున్నారు. యువతికి మరో యువకుడితో కుటుంబీకులు నిశ్చితార్థం జరిపించారు. దీంతో గంగాధర్‌ సోమవారం రాత్రి 11:30 సమయంలో వాయి పేట్‌కు వచ్చి యువతిని వెంట తీసుకువెళ్లాడు. గ్రామ శివారులోని ఓ చేనులో ఓ రైతు అటవీ జంతువుల నుంచి పంట రక్షణకు అమర్చిన కరెంట్‌ తీగను తగలడంతో వారిద్దరూ షాక్‌కు గురై స్పృహ కోల్పోయి పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత వారికి స్పృహ రాగా ఎవరిళ్లకు వారు వెళ్లి జరిగిన సంఘటన గురించి తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీరేష్‌ తెలిపారు.

Updated Date - 2022-12-07T00:00:32+05:30 IST