‘ధరణి’తో ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-12-15T22:48:56+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌ పలు సమస్యలకు నెలవుగా మారింది. ఆన్‌లైన్‌ విధానంలో భూమికి సంబంధించిన అన్ని లావాదేవీలు, సమాచారం పారదర్శకంగా ఉండేలా ధరణి పోర్టల్‌ను 2019 అక్టోబర్‌లో రూపొందించారు

‘ధరణి’తో ఇక్కట్లు

ఏసీసీ, డిసెంబరు 15: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌ పలు సమస్యలకు నెలవుగా మారింది. ఆన్‌లైన్‌ విధానంలో భూమికి సంబంధించిన అన్ని లావాదేవీలు, సమాచారం పారదర్శకంగా ఉండేలా ధరణి పోర్టల్‌ను 2019 అక్టోబర్‌లో రూపొందించారు. పోర్టల్‌లో భూముల సమాచారం తప్పుల తడకగా ఉంది. ధరణి లోపాలను సవరించేం దుకు అధికారులకు అవకాశం లేకపోవడం ప్రజలకు శాపంగా మారింది. పోర్టల్‌ను ప్రారంభించి రెండు సంవత్సరాలు గడి చినప్పటికీ లోపాలను సవరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పోర్ట ల్‌ నిర్వహణ అంతా హైదరాబాద్‌ కేం ద్రంగా సీసీఎల్‌ఏ చేతుల్లో ఉండడంతో ప్రజల సమస్యలపై అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.

పట్టా భూములు నిషేధిత జాబితాలో

భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వేల ఎక రాల పట్టా, వ్యవసాయ భూములను నిషేధిత జాబి తాలో చేర్చారు. వ్యవసాయ భూములను ఇండ్ల స్థలాలుగా, పట్టా భూములను అటవీ, ప్రభుత్వ భూములుగా నమోదు చేశారు. దీంతో భూ యజమానులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయ లేదు. వారికి రైతుబంధు, బీమా, పంట రుణం పొందలేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎకరాల విస్తీర్ణంతో ఉన్న సర్వే నం బర్‌లో కొంత భాగం నిషేధిత జాబితాకు చెందిన భూమి ఉండగా అదే సర్వే నంబర్‌లో మిగతా పట్టా భూమి ఉన్నప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. మరికొన్ని సందర్భాల్లో ఊళ్ళు, నివాస ప్రాంతాలకు సమీపంగా ఉన్న వ్యవసాయ భూములను ఇండ్ల స్థలాలుగా పేర్కొన్నారు.

కార్యాలయాల చుట్టు తిరుగుతున్న బాధితులు

ధరణి పోర్టల్‌లో తప్పుల వల్ల నష్టపోయిన బాధితులు ఏండ్ల తరబడి తహసీల్దార్‌ నుంచి మొదలుకొని కలెక్టర్‌ కార్యాలయం వరకు తిరిగినా న్యాయం జరగడం లేదు. ధరణి పోర్టల్‌లో ఉన్న వివరాలను సవరించి మార్పులు, చేర్పులు చేసే అధికారం ప్రభుత్వం జిల్లా స్థాయి లో ఏ అధికారికి ఇవ్వలేదు. కేవలం పోర్టల్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసు కున్న వినియోగదారులకు పని పూర్తి చేసే అవకాశం మాత్రమే ఉంది. ధరణి పోర్టల్‌పై సర్వత్రా వ్యతిరేకతలు వెల్లువెత్తడంతో ప్రజలు, రాజ కీయ పార్టీలు ధరణిని రద్దు చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో నిషేధిత జాబితాను కలెక్టర్‌ సవరించి పట్టాలు జారీ చేసే అధికారం ప్రభుత్వం కల్పించింది. దాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు, అధికారులు పెద్దఎత్తున అవినీతికి తెరలేపారు. ధరణి పట్టా దారు పాస్‌ పుస్తకం రాని భూ యజమానులకు పాస్‌ పుస్తకాలు ఇప్పిస్తామని లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. పట్టణ ప్రాం తాల్లో సాగు చేసుకుంటున్న అసైన్డ్‌ భూములకు ధరణి పోర్టల్‌ ద్వారా డిజిటల్‌ పట్టాదా రు పాస్‌ పుస్తకాలను ప్రభుత్వం జారీ చేయలేదు. ఏండ్ల తరబడి తిరిగినా పని కాదనే భయంతో బాధితులు మధ్యవర్తులకు అడిగినం త సమర్పించుకొని పని కానిస్తున్నారు.

అస్తవ్యస్తంగా ధరణి పోర్టల్‌

వ్యవసాయ భూముల లావాదేవీలను ధరణి ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించాలనే ఉద్దేశంతో రూపొం దించినప్పటికి పోర్టల్‌లో అన్ని రకాల లావాదేవీలకు చోటు కల్పించ లేదు. కొన్ని లావాదేవీలకు స్లాట్‌ బుక్‌ కాకపోవడంతో ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. డబ్బు చెల్లించి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల రిజిస్ర్టేషన్‌ ఆగిపోతే చాలాన్‌ సొమ్ము ఏండ్లు గడిచినా తిరిగి జమ కావడం లేదు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములకు మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌, ఎన్‌కాంబరెన్స్‌ సర్టిఫికెట్‌, రిజిస్ట్రర్‌ అయిన దస్తావేజు సర్టిఫైడ్‌ కాపీ జారీ చేయడం లేదు.

లోపాలను సవరించడంలో అధికారుల విఫలం

ధరణి పోర్టల్‌లో లోపాలను సవరించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఏండ్ల తరబడి వేల ఎకరాలకు సంబంధించి లక్షలాది మంది పట్టాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టాదారులు అత్యవసర సమయాల్లో భూమి విక్రయించేందుకు ధరణి పోర్టల్‌ పొరపాట్ల వల్ల ఆశలు అడియాశలవు తున్నాయి. అధికారులు చేసిన తప్పిదాల వల్ల ప్రజల ఆస్తి హక్కుకు రక్షణ లేకుండా పోయింది. పిల్లల ఉన్నత విద్య, పెళ్లిల్లు, గృహ నిర్మాణం, వైద్య చికిత్సల ఖర్చులు, అప్పులు తీర్చుకోవడం, ఇతర అత్యవసరాలకు కూడా పట్టా భూములను విక్రయించుకోలేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ వల్ల కలిగే నష్టాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

సమస్య తీరడం లేదు......కేస జ్యోతి, మంచిర్యాల

చెన్నూర్‌ మండలం కిష్టంపేట శివారులో పట్టా భూమి సర్వే.నం. 378/ఆ లో విస్తీర్ణం ఒక ఎకరం, 378/అలో 36 గుంటలకు పట్టాదారుగా ఉండి గతంలో పట్టాదారు పాస్‌ పుస్తకం కూడా పొందాను. ధరణిలో పొరపాటుగా నిషేధిత జాబితాలో నేషనల్‌ హైవే కింద చేర్చారు. నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేయాలని ధరణి పోర్టల్‌ దరఖాస్తు నం. 2200000346 ద్వారా ఆర్జీ పెట్టుకొని ఏడాది గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. పక్క సర్వే నంబర్‌ 378/ఆ/2 లో 30 గుంటల భూమిని గతంలో నేషనల్‌ హైవే కోసం సేకరించి పరిహారం చెల్లించారు. దానికి నా భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినా పక్కన ఉన్నందుకు నా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయం.

స్లాట్‌ క్యాన్సల్‌ చేసుకున్నా డబ్బులు రావడం లేదు

జుంబిడి రాజమల్లు, మిట్టపల్లి, జైపూర్‌

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల గ్రామంలో సర్వేనం. 218/1, సర్వే నం. 40/ఆ లో మూడు ఎకరాల 2 గుంటల భూమి కొనుగోలు చేసేందుకు ధరణిలో 2022 ఏప్రిల్‌ 10న స్లాట్‌ బుక్‌ చేసుకున్నాను. కొన్ని కారణాల వల్ల రిజిస్ర్టేషన్‌ కానందున స్లాట్‌ క్యాన్సల్‌ చేసుకున్నా. 8 నెలలు గడిచినా ఇంత వరకు రూ. 59,372 ప్రభుత్వం నుంచి తిరిగి నా అకౌంట్‌లో జమ కాలేదు.

దరఖాస్తుల్లో కొన్ని రిజెక్ట్‌ అయ్యాయి

శ్రీనివాస్‌దేశ్‌పాండే, తహసీల్దార్‌, చెన్నూర్‌

ధరణి పోర్టల్‌ గ్రీవెన్స్‌లో గతంలో పెట్టుకున్న దరఖాస్తులలో కొన్ని ఆటోమెటిక్‌గా రిజెక్ట్‌ అయ్యాయి. రిజెక్ట్‌ అయిన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం మా దగ్గర పది అప్లికేషన్‌లు కూడా పెండింగ్‌లో లేవు. నెల రోజుల నుంచి ధరణి పోర్టల్‌ నిషేధిత జాబితా దరఖాస్తులు (టీఎం33) మోడిఫికేషన్‌ రెక్వెస్ట్‌ అప్లికేష న్‌లతో కలిపి 500 నుంచి 600 దరఖాస్తులు క్లియర్‌ చేశారు. అప్లికేషన్‌లు క్లియర్‌ అయిన వారికి ప్రొసీజర్‌ ప్రకారం పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ అవుతాయి.

Updated Date - 2022-12-15T22:48:59+05:30 IST