ఇప్పపువ్వు సేకరణలో గిరిజనులు
ABN , First Publish Date - 2022-04-11T04:24:54+05:30 IST
మండలంలోని పలుగ్రామాల్లో గిరిజనులు ఇప్పపువ్వులను సేకరిస్తున్నారు. వేసవి సీజన్‌లో లభించే ఇప్పపువ్వులను గ్రామస్థులు సేకరించి జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో పాటు స్థానిక వ్యాపారులకు విక్రయింస్తుంటారు.
కెరమెరి, ఏప్రిల్ 10: మండలంలోని పలుగ్రామాల్లో గిరిజనులు ఇప్పపువ్వులను సేకరిస్తున్నారు. వేసవి సీజన్‌లో లభించే ఇప్పపువ్వులను గ్రామస్థులు సేకరించి జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో పాటు స్థానిక వ్యాపారులకు విక్రయింస్తుంటారు. వేకువ జామున లేచి దట్టమైన అడవుల్లో చెట్టుచెట్టుకు తిరుగుతూ ఇప్పపువ్వు సేకరించి ఆదాయాన్ని పొందుతున్నారు. మండ లంలోని బాబే ఝరి, పాట్నాపూర్, జోడే ఘాట్, ధనోర, చిన్న పాట్నాపూర్, పెద్ద పాట్నాపూర్, నాగల్ గొంది, కల్లెగాం, పిట్ట గూడ తదితర గ్రామాల్లో గిరిజనులు ఇప్పపువ్వు సేకరిస్తు న్నారు.