ఆదివాసీలు దేవతలకు పూజలు

ABN , First Publish Date - 2022-01-22T04:19:23+05:30 IST

మండలంలోని దుబ్బగూడ-శివ నూర్‌ గ్రామల అటవీ ప్రాంతంలో సిర్పూర్‌కార్‌ ఆత్రం వంశీయుల సత్తీక్‌ దేస్థానంలో శుక్రవారం ఆది వాసులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.

ఆదివాసీలు దేవతలకు పూజలు
భీం దేవుడికి మొక్కుతున్న ఆదివాసులు

జైనూర్‌,జనవరి21: మండలంలోని దుబ్బగూడ-శివ నూర్‌ గ్రామల అటవీ ప్రాంతంలో సిర్పూర్‌కార్‌ ఆత్రం వంశీయుల సత్తీక్‌ దేస్థానంలో శుక్రవారం ఆది వాసులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ సంద ర్భంగా సిర్పూర్‌కార్‌ ఆత్రం వంశీయుల కుల గురువు ఆత్ర లింబారావు కటోడ సత్తీక్‌ తమ కులదైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేధ్యం సమర్పించారు. కోయ పుణేం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆత్రం ఆనందరావు, ఆత్రం ఇస్రు, తదితరులు పాల్గొన్నారు.

భీం దేవుడికి పూజలు

పుష్యమాసాన్ని పురస్కరించుకుని మండలంలో ఆదివాసులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. మండలంలోని జెండాగూడ పంచాయతీ పరిధిలో గల అల్లిగూడలో శుక్రవారం ఆదివాసులు భీందేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉయిక చందన్‌శావ్‌, గ్రామస్థులు లింగుస్వామి, యాదవ్‌రావ్‌, సీతారాం, భగ్వంత్‌రావ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-22T04:19:23+05:30 IST