చరిత్రలో నిలిచేలా.. నాగోబా ఆలయం
ABN , First Publish Date - 2022-12-17T23:41:53+05:30 IST
నాగోబా ఆలయం చ రిత్రలో నిలిచేలా ఉందని, ఈ ఆలయాన్ని ఆధ్యా త్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రభు త్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ శా ఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
ఇంద్రవెల్లి, డిసెంబర్17: నాగోబా ఆలయం చ రిత్రలో నిలిచేలా ఉందని, ఈ ఆలయాన్ని ఆధ్యా త్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రభు త్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ శా ఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మం డలంలోని కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నాగోబా ఆలయ విగ్రహ పునప్రతిష్ఠాన కార్యక్ర మంలో భాగంగా శనివారం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ నగేష్, మెస్రం వంశీయు లతో కలిసి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశా రు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు, ఉత్సవ కమిటీ స భ్యులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మెస్రం వంశీయులు రూ.5 కోట్ల విరాళాలతో గర్భగుడిని నిర్మిం చుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మి క పుణ్యక్షేత్రాలలో యాదాద్రి తరువాత నాగోబా దేవా లయం అన్నారు. దర్బార్, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరత ద్వారా తా గునీరు అందిస్తామని, విద్యుత్, రహదారుల సౌకర్యం కల్పిస్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆల యాభివృద్ధి, సుందరీకరణ, కోనేరు, భూమి చదును, దర్బార్ హాల్, రహాదారుల నిర్మాణానికి రూ. 10.35 కోట్లు నిధులను సీఎం మంజూరు చేశారన్నారు. మరి న్ని నిధులు దేవాదాయ శాఖ ద్వారా మంజూరు చేస్తా మన్నారు. నిత్యపూజ, దీపదూప నైవేద్యానికి పూజా రులు ఆలయ పర్యవేక్షణకు సిబ్బందిని నియమించు టకు ప్రతిపాధనలు ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఆలాగే ఉమ్మడి జిల్లాలోని గుడిరేవు పద్మల్‌పురికి రూ. 50 లక్షలు, జంగుబాయి ఉత్సవాలకు ప్రతియేటా రూ. 10 లక్షలు, వంద దేవాలయాలు నిర్మించేందుకు పది లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. జనవరి 21న నాగోబా జాతర రోజున పౌష్ఠిక ఆహార ప్యాకె ట్లు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, పీవో వరుణ్‌రెడ్డి, ఆలయ పీఠాధిప తి వెంకట్‌రావు, ఏటీడబ్య్లూఎసీ చైర్మన్ లక్కెరావు, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఇంద్ర వెల్లి, నేరడిగొండ జడ్పీటీసీలు పుష్పలత, అనిల్ జాదవ్, ఈఈ రాథోడ్ భీంరావు, సర్పంచ్ మెస్రం రేణుక నాగ్‌నాథ్, మెస్రం వంశీయులు చిన్నుపటేల్, మెస్రం కోసేరావు, మెస్రం తుకారాం పాల్గొన్నారు.