TS News: నిర్మల్ జిల్లాలో బీహార్ దొంగల ముఠా హల్‌చల్

ABN , First Publish Date - 2022-08-29T16:31:57+05:30 IST

నిర్మల్ (Nirmal): జిల్లాలో బీహార్ దొంగల (thieves) ముఠా (gang) హల్ చల్ (Hal Chal) చేస్తోంది.

TS News: నిర్మల్ జిల్లాలో బీహార్ దొంగల ముఠా హల్‌చల్

నిర్మల్ (Nirmal): జిల్లాలో బీహార్ దొంగల (thieves) ముఠా (gang) హల్ చల్ (Hal Chal)  చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలను దొంగల ముఠా వణికిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. ఈ దొంగల ముఠాతో బాసర, కుభీరు, తానూరు, లోకేశ్వరం మండలాల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. దొంగల ముఠా సంచరిస్తోందన్న సమాచారంతో గ్రామస్తులంతా రాత్రి, పగలు అనే తేడా లేకుండా గస్తీ కాస్తున్నారు. అనుమానితులను పట్టుకుని వివరాలు తెలుసుకుంటున్నారు. 


ఇక పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో దొంగతనాలు పెరిగిపోయాయి. అక్కడున్న బంధువులు, స్నేహితుల ద్వారా గ్రామస్తులు సమాచారం తెలుసుకుంటున్నారు. అక్కడి దొంగలు తెలంగాణలో ప్రవేశించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. యువకులు, పెద్దలు కలిసి గల్లీ గల్లీల్లో గస్తీ కాస్తున్నారు. ప్రతి రోజు 50 మందికిపైగా కర్రలు పట్టుకుని పహరా కాస్తున్నారు.

Read more