కుటుంబాల్లో సంతోషం వెళ్లివిరియాలి

ABN , First Publish Date - 2022-09-29T04:30:35+05:30 IST

బతుకమ్మ పండుగతో ప్రజలందరి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.

కుటుంబాల్లో సంతోషం వెళ్లివిరియాలి
బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

 -  జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి  

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు  28: బతుకమ్మ పండుగతో ప్రజలందరి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.  జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో  జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన నాన బియ్యం బతుకమ్మ వేడుకల్లో కలె క్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ బతుకమ్మ పండుగలో భాగంగా సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజు ప్రత్యేకమైన రోజన్నారు. స్వచ్ఛందంగా ఉద్యోగులు, మహిళలు పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో శేషాద్రి, మహిళా ఉద్యోగులు ,స్వయం సహాయక సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.  

Read more