రాయపూర్‌ కాండ్లీలో చోరీ

ABN , First Publish Date - 2022-01-29T05:00:51+05:30 IST

మండంలోని రాయపూర్‌ కాండ్లీలో గురువారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లేష్‌ తన కుటుంబ సభ్యులతో పెద్ద గుట్టకు మొక్కు చెల్లించేందుకు సా యంత్రం బయలు దేరి వెళ్లారు. దీంతో దొంగలు రాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు.

రాయపూర్‌ కాండ్లీలో చోరీలోకేశ్వరం, జనవరి 28 : మండంలోని రాయపూర్‌ కాండ్లీలో గురువారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లేష్‌ తన కుటుంబ సభ్యులతో పెద్ద గుట్టకు మొక్కు చెల్లించేందుకు సా యంత్రం బయలు దేరి వెళ్లారు. దీంతో దొంగలు రాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని ముఽథోల్‌ సీఐ వినోద్‌, లోకేశ్వరం ఎస్సై సాయి కుమార్‌, నిర్మల్‌ క్లూస్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నగదుతో పాటు బంగారు, వెండి దాదాపు రూ.2లక్షల 20 వేలు చోరీ జరిగినట్లు ఎస్సై సాయి కుమార్‌ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read more