బీజేపీ గద్దె కూల్చిన దుండగులను శిక్షించాలి

ABN , First Publish Date - 2022-07-06T04:08:45+05:30 IST

బిట్టూరుపల్లిలో బీజేపీ జెండా గద్దెను సోమవారం అర్ధరాత్రి కూల్చివేశారు. దుండగులను శిక్షించాలని మంగళవారం బిట్టూరుపల్లి రహదారిపై నియోజకవర్గ ఇన్‌చార్జి కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జూన్‌ 30వ తేదీన జమ్ముకాశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్‌ గుప్తా జెం డాను ఆవిష్కరించారని, పార్టీ బలోపేతాన్ని జీర్ణించుకోలేక టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తెలిపారు.

బీజేపీ గద్దె కూల్చిన దుండగులను శిక్షించాలి
బిట్టూరుపల్లి రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు

భీమిని, జూలై 5: బిట్టూరుపల్లిలో బీజేపీ జెండా గద్దెను సోమవారం అర్ధరాత్రి కూల్చివేశారు. దుండగులను శిక్షించాలని మంగళవారం బిట్టూరుపల్లి రహదారిపై నియోజకవర్గ ఇన్‌చార్జి కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జూన్‌ 30వ తేదీన జమ్ముకాశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్‌ గుప్తా జెం డాను ఆవిష్కరించారని, పార్టీ బలోపేతాన్ని జీర్ణించుకోలేక టీఆర్‌ఎస్‌ పార్టీ  నాయకులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తెలిపారు.  పోలీసులు  జెండా గద్దెను కూల్చిన నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ మం డల అధ్యక్షుడు పులబోయిన భీమన్న, జిల్లా కార్యదర్శి గోవర్ధన్‌, కౌన్సిలర్‌ అనిత రాజులాల్‌యాదవ్‌,  మండల ఉపాధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి దశరధం, సత్తయ్య, నాయకులు రామన్న, శైలేందర్‌, శ్రావణ్‌, నాగరాజు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-06T04:08:45+05:30 IST