పోడు భూముల సర్వే పకడ్బందీగా చేపట్టాలి

ABN , First Publish Date - 2022-10-08T06:44:40+05:30 IST

ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద సాగుచేస్తున్న భూముల సర్వేను పకడ్బందీగా, నిబంధనల మేరకు చేపట్టాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అ న్నారు. శుక్రవారం రోజున క్యాంపు కార్యాలయం నుంచి గ్రామ, మండల స్థాయి ఎఫ్‌ఆర్‌సీ కమిటీలకు గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన

పోడు భూముల సర్వే పకడ్బందీగా చేపట్టాలి
పరీక్ష కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేస్తున్న కలెక్టర్‌

అధికారులకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశం

ఆదిలాబాద్‌ టౌన్‌, అక్టోబరు 7: ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద సాగుచేస్తున్న భూముల సర్వేను పకడ్బందీగా, నిబంధనల మేరకు చేపట్టాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అ న్నారు. శుక్రవారం రోజున క్యాంపు కార్యాలయం నుంచి గ్రామ, మండల స్థాయి ఎఫ్‌ఆర్‌సీ కమిటీలకు గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన యాప్‌పై జూమ్‌ మీట్‌ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లా డుతూ.. అటవీ భూములు సాగుచేస్తున్న వారి ధరఖాస్తుల ఆధారంగా అటవీ హక్కు చట్టం ప్రకారం భూముల సర్వే చేయాలని, భూముల విస్తీర్ణం, మ్యాపు లు, దరఖాస్తుదారుడి ఫొటో, తదితర అంశాలను గ్రామ టీమ్‌లు సర్వే చేసి రిపో ర్టులు తీసకోవాలని అన్నారు. ఆయా భూములు సాగు చేస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలని అన్నారు. అనంతరం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మం డలాల వారిగా యాప్‌పై జిల్లా మేనేజర్‌ బండి రవి, ఐటీడీఏ సిబ్బంది సుమన్‌లు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణల అటవీ, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రూప్‌-1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలి 

ఆదిలాబాద్‌ టౌన్‌: ఈ నెల 16న టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్‌-1 పరీక్షను పకడ్బందీ నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజున కలెక్టర్‌ సమావేశ మందిరంలో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణకు ఆయా పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, సీటింగ్‌, ఇతర సౌకర్యాలపై చీఫ్‌ సూపరిండెంట్‌, లైజన్‌, సహా య లైజన్‌ అఽధికారులు, పాఠశాలల మేనేజ్మెంట్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో గ్రూప్‌-1 పరీక్ష రాసే అభ్యర్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, ముఖ్యంగా సీసీ కెమెరా లు ప్రతీ పరీక్ష గదిలో, చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదుల్లో  ఏర్పాటు చేయాలని అన్నారు. త్రాగునీరు, లైటింగ్‌ సౌకర్యం, కూర్చునెందుకు డ్యూయెల్‌ సీటింగ్‌, తది తర ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ప్రతీ కేంద్రంలో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని నియమించాలని, సరైనా సమయానికి ముందే ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఏర్పాట్లు చేయాలని పలువురు సూపరింటెండెంట్‌లు కలెక్టర్‌ను కోరారు. దీనిలో భాగంగా మావలలోని నలంద డిగ్రీ కళాశాలలో 744, ఆర్యభట్ట ఇంటర్నేషనల్‌ పాఠశాలలో 300, కృష్ణవేణి టాలెంట్‌ పాఠశాలలో 240, తెలంగాణ స్టేట్‌ మోడల్‌ స్కూల్‌ బంగారుగూడలో 240, ఎస్‌ఆర్‌ డీజీ పాఠశాలలో 240, ప్రభుత్వ డైట్‌ కళాశాలలో 192, విద్యార్థి జూనియర్‌ అండ్‌ డిగ్రీ కళాశాలలో 720, ఆదిత్య జూనియర్‌ కళాశా లలో 312, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో 300, సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ పాఠశాలలో 288, మథర్స్‌ కేర్‌ పాఠశాలలో240, లిటిల్‌ ప్లవర్‌ పాఠశాలలో 240, ప్రభుత్వ గెజిటేడ్‌ పాఠశాలలో 200, శ్రీసరస్వతీ శిశుమందిర్‌ పాఠశాలలో 240, లిటిల్‌ స్టార్‌ పాఠశాలలో 240 టీటీడబ్ల్యూఆర్‌ బాలుర పాఠశా లలో240, చావర అకాడమీలో 648, శ్రీచైతన్య మావల పాఠశాలలో 336, ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ మావల పాఠశాలలో 240 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సమావేఽశంలో డీఈవో ప్రణీత, తహసీల్దార్‌లు, కలెక్టరేట్‌ పర్యవేక్షకురాలు వర్ణ, ఆయా పాఠశాలల యాజమాన్యం పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌: టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించనున్న గ్రూప్‌-1 పరీక్షకు సంబంధించిన కేంద్రాలలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ సంబంధిత శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గ్రూప్‌-1 పరీక్ష నేపథ్యంలో పలు కేంద్రాల ను శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు. స్థానిక విద్యార్థి జూనియర్‌ కళాశాల, లిటిల్‌ స్టార్‌ హైస్కూల్‌, ఆర్యభట్ట ఇంటర్నేషనల్‌ పాఠశాలలను ఆర్డీవో రమేష్‌రాథోడ్‌తో కలిసి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రూప్‌-1 కేంద్రాలలో అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రతీ కేంద్రంలోనిపరీక్ష హాల్‌లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయా యజమాన్యాలను ఆదేశించారు. కెమెరాల ఏర్పాటు విషయాలను డీఈవో, ఆర్డీవోలు పర్యవేక్షించాల న్నారు. 19 కేంద్రాలలో 6,200 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలి పారు. ఆయా కేంద్రంలోని గదుల సామర్థ్యాన్ని బట్టి అభ్యర్థులకు సిటింగ్‌ కెపాసిటి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రణిత, కలెక్టరేట్‌ పర్య వేక్షకురాలు వర్ణ, తదితరులు పాల్గొన్నారు.

Read more