పోడు భూముల సర్వే పకడ్బందీగా చేపట్టాలి

ABN , First Publish Date - 2022-10-05T03:31:05+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోడు భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జి చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌ అన్నారు

పోడు భూముల సర్వే పకడ్బందీగా చేపట్టాలి
టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

= ఇన్‌చార్జి సీఎస్‌ అరవింద్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 4: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోడు భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జి చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌ అన్నారు. పోడు భూముల సర్వేకి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల సర్వే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. క్లైయిములు ఎక్కువగా ఉన్న జిల్లాలో డిసెంబరు రెండో వారం పూర్తి చేయాలని చెప్పారు. తక్కువగా ఉన్న జిల్లాలో త్వరగా పూర్తి చేయాలన్నారు. సర్వే లోటు పాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా క్లెయిమ్స్‌ ఉన్నాయన్నారు. సాధ్యమైంతన త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. డిసెంబరు నాటికి సర్వే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి దినేష్‌కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Read more