పోడు భూముల సర్వే పకడ్బందీగా చేపట్టాలి

ABN , First Publish Date - 2022-10-02T04:10:01+05:30 IST

పోడుభూమి సాగుచేస్తున్న రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పట్టాలకు సంబంధించిన సర్వేను అధికారులు ఎలాంటి అవకతవకలకు లేకుండా పకడ్బందీ గా చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌ మండలం వావుదాం, గంటలగూడ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే పనులను రెవెన్యూ, పోలీసు, అటవీశాఖాధికా రులు, ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలిం చారు.

పోడు భూముల సర్వే పకడ్బందీగా చేపట్టాలి
సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 1: పోడుభూమి సాగుచేస్తున్న రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పట్టాలకు సంబంధించిన సర్వేను అధికారులు ఎలాంటి అవకతవకలకు లేకుండా పకడ్బందీ గా చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌ మండలం వావుదాం, గంటలగూడ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే పనులను రెవెన్యూ, పోలీసు, అటవీశాఖాధికా రులు, ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోడు భూములకు సంబంధించి చేపట్టిన సర్వేలో అధికా రులు పూర్తిజాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలతో స్నేహ పూర్వకంగా మెదలాలని, పట్టాలకోసం అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సర్వే నిర్వహించా లని తెలిపారు. అర్హులైన గిరిజనులను గుర్తించి ఆర్‌వో ఎఫ్‌ఆర్‌ చట్టం 2005 నియమ నిబంధనలను ఖచ్చి తంగా పాటించాలన్నారు.

Read more