అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-09-12T04:33:40+05:30 IST

అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఆసిఫాబాద్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారి యోగేష్‌ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గందపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీనివాస్‌ స్మారకార్థం ప్రతీ సంవత్సరం అమర వీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
బెజ్జూరులో అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న అటవీ అధికారులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 11: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఆసిఫాబాద్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారి యోగేష్‌ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గందపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీనివాస్‌ స్మారకార్థం ప్రతీ సంవత్సరం అమర వీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ రేంజ్‌ అధికారు లు ప్రవీణ్‌కుమార్‌, సరోజరాణి, శ్రీధరచారి,రవి, అత్తురుద్దీన్‌, లక్ష్మణ్‌,రవి, సతీష్‌పాల్గొన్నారు. 

బెజ్జూరు: బెజ్జూరుమండలకేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో జాతీయఅటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన అటవీఅధికారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డిప్యూటీరేంజ్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌, సెక్షన్‌, బీట్‌అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more