రూట్‌మ్యాప్ ఖరారు
ABN , First Publish Date - 2022-11-27T01:07:32+05:30 IST
జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ ఈ నెల 28వ తేదీ నుంచి చేపట్టే మహాసంగ్రామ పాదయాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు మనోహర్‌రెడ్డి, వీరేంధర్‌గౌడ్, పడకంటి రమాదేవి, రావుల రాంనాథ్ తదితరులు వెల్లడించారు.
విభాగాల వారీగా ఇన్‌చార్జీల నియామకం
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ హాజరు
భారీ చేరికలకు రంగం సిద్ధం
నిర్మల్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ ఈ నెల 28వ తేదీ నుంచి చేపట్టే మహాసంగ్రామ పాదయాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు మనోహర్‌రెడ్డి, వీరేంధర్‌గౌడ్, పడకంటి రమాదేవి, రావుల రాంనాథ్ తదితరులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 114 కిలో మీటర్లకు పైగా బండిసంజయ్ తన పాదయాత్రను చేపట్టే బహిరంగ సభలో మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొననున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇదిలా ఉండగా ముథోల్ నియోజకవర్గంలో 31.4 కిలోమీటర్లు, నిర్మల్ నియోజకవర్గంలో 58 కిలోమీటర్లు, ఖానాపూర్ నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల మేరకు బండిసంజయ్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు భైంసా బహిరంగసభతో మొదలయ్యే పాదయాత్ర కుంటాల, నర్సాపూర్, దిలావర్‌పూర్, నిర్మల్‌రూరల్, నిర్మల్‌టౌన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్ మండలాల్లో కొనసాగనుంది. కాగా మొత్తం 33 గ్రామాలతో పాటు భైంసా, నిర్మల్, ఖానాపూర్ పట్టణాలలో ఈ మహాసంగ్రామయాత్ర నిర్వహించనున్నారు. బండిసంజయ్ గుండెగాం, లింబా, బామ్ని రాం పూర్, చిట్యాల, ముక్తాపూర్, పోట్టపెల్లి, దిమ్మదుర్తి మస్కాపూర్‌లలో రాత్రి బస చేయనున్నారు. ఆ మరుసటి రోజూ ఉదయం నుంచి తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇలా మండలాల వారీగా సంజ య్ చేపట్టే పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను పకడ్భందీగా తయారు చేశారు.
ప్రజా సంగ్రామ యాత్ర ఇన్‌చార్జీలు వీరే
కాగా ఈ రూట్‌మ్యాప్‌కు అనుగుణంగా బండిసంజయ్ పాదయాత్ర సందర్భంగా అన్నిరకాల ఏర్పాట్లు, ప్రచారం, జనసమీకరణ లాంటి వాటి కోసం ప్రత్యేకంగా పార్టీ సీనియర్ నేతలను ఇన్‌చార్జీలుగా నియమించారు. ప్రజాసంగ్రామయాత్ర ఆయా శాఖల ఇన్‌చార్జీల నియామక జాబితాను ఎంపీ సోయంబాపురావు వెల్లడించారు. జిల్లాయాత్ర ప్రముఖులుగా పడిపెల్లి గంగాధర్, యాత్ర సహప్రముఖ్‌గా డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, ముథోల్ అసెంబ్లీ యాత్ర ప్రముఖ్‌గా మోహన్‌పటేల్, నిర్మల్‌కు అప్పాల గణేష్‌చక్రవర్తి, ఖానాపూర్‌కు హరినాయక్, యాత్ర రూట్ విభాగం ఇన్‌చార్జీగా నాయుడి మురళీధర్, నాంపెల్లి శశిరాజ్‌వర్మ, మీడియా విభాగం ఇన్‌చార్జీలుగా రావుల రాంనాథ్, రాచకొండ సాగర్, సోషల్ మీడియా విభాగం ఇన్‌చార్జీలుగా నరేష్‌చూపే, కొండా సురేష్, భోజన విభాగం ఇన్‌చార్జీలుగా మెడిసెమ్మరాజు, అయ్యన్న గారి రాజేంధర్, తోట సత్యనారాయణ, వసతివిభాగం ఇన్‌చార్జీలుగా సామరాజేశ్వర్‌రెడ్డి, మిట్టపెల్లి రాజేంధర్, అల్లంభాస్కర్, మెడికల్ విభాగం ఇన్‌చార్జీలుగా కొరిపల్లి శ్రావణ్‌రెడ్డి, డాక్టర్‌రాము, డాక్టర్ నరేష్, మహిళ విభాగం ఇన్‌చార్జీలుగా జానకీబాయి, వడ్లకొండ అలివేలు, కాన్వాయ్ విభాగం ఇన్‌చార్జీలుగా నగర్ నారాయణరెడ్డి, కొండాజీ శ్రావణ్, జిల్లా వ్యవస్థ ప్రముఖ్‌గా అయ్యన్నగారి భూమయ్యలు వ్యవహరించనున్నట్లు సోయం బాపురావు తెలిపారు. రక్షణ విభాగం ఇన్‌చార్జీలుగా అను ముల శ్రావణ్, గిల్లి విజయ్, ప్రచార పబ్లిసిటీ విభాగం ఇన్‌చార్జీలుగా నితీష్ రాథోడ్, బర్కుంట నరేంధర్, పుట్నాల సాయినాథ్, రూట్ సుంధరీకరణ ఇంచార్జీలుగా శ్రీనివార్, కుమ్మరి వెంకటేశ్, సాంస్కతిక బృం దాల విభాగం ఇన్‌చార్జీలుగా దిలీప్, ఈవెంట్స్ ఆండ్ ఇంటరాక్షన్స్ విభా గం ఇన్‌చార్జీలుగా కమల్‌నయన్, బద్దం పూజారెడ్డి, సంగ్రామ సేన విభాగం ఇన్‌చార్జీలుగా ఓడిసెల అర్జున్, ఉపేంధర్, జన సమీకరణ విభాగం ఇన్‌చార్జీలుగా మోహన్ పటేల్, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, హరి నాయక్, ప్రచారరథాల విభాగం ఇన్‌చార్జీలుగా సాధం అరవింద్, సుమన్, అతిథివిభాగం ఇన్‌చార్జీలుగా అయ్యన్న గారి భూమయ్య, గోపాల్‌సార్‌డా, సభల విభాగం ఇన్‌చార్జీలుగా పడాల రాజశేఖర్, సందుపట్ల శ్రావణ్, అనుమతుల విభాగం ఇన్‌చార్జీలుగా రవిపాండే, వినాయక్‌రెడ్డి, జాయినింగ్ విభాగం ఇన్‌చార్జీలుగా శ్రీ రామోజీ నరేష్, రావుల పోశేట్టి, జలవిభాగం ఇన్‌చార్జీలుగా గాలిరవి, కపిల్‌సిందే, ప్రబంధకుల విభాగం ఇన్‌చార్జీలుగా గాదే విలాస్, కాసరి రామకృష్ణలను నియమించారు.
ముఖ్యఅతిథిగా ఫడ్నవీస్
భైంసాలో జరిగే బండి సంజయ్ బహిరంగసభలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పాల్గొననున్నారు. భైంసా పట్టణం మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న కారణంగానే ఫడ్నవీస్‌ను ముఖ్యఅతిథిగా ఇక్కడికి రప్పిస్తున్నారంటున్నారు. ఫడ్నవీస్ మరాఠీలో ధారాళంంగా ప్రసంగించనున్న కారణంగా ఆయనను ప్రత్యేకంగా ఇక్కడికి రప్పిస్తున్నారంటుటున్నారు. భైంసా బహిరంగసభలో ముథోల్ నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేపట్టనున్న కారణంగా అక్కడి ప్రాంత వాసులకు మరాఠీ భాషపై ఎక్కువపట్టు ఉండడంతో ఫడ్నవీస్‌ను బహిరంగసభలో ప్రసంగించేందు కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు.
భారీ చేరికలకు రంగం సిద్ధం
బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ముథోల్ నియోజకవర్గం నుంచి కూడా మాజీ డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్‌తో పాటు ఆయన అభిమానులు, అనుచరులు మరికొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నారని ప్రచారం ఊ పందుకుంది. నిర్మల్ నియోజకవర్గం నుంచి కూడా పలువురు బీజేపీలో చేరేందురు రంగం సిద్దమైందన్న వాదనలు మొదలయ్యాయి. గత వారం రోజుల నుంచి చేరికలపై బీజేపీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందంటున్నారు. మొత్తం పది రోజుల పాటు జరిగే మహ సంగ్రామ పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ పార్టీలో చేరే వారందరికి కండువాలు కప్పి వారిని కాషాయదళంలోకి స్వాగతించనున్నట్లు చెబుతున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తి వాదులు ఇప్పటికే బీజేపీ సీనియర్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారంటున్నారు. మొత్తానికి భారీ చేరికలు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.