హమాలీ కార్మికుల రేట్లు పెంచాలి
ABN , First Publish Date - 2022-12-15T22:42:55+05:30 IST
సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికుల రేట్లు పెంచాలని పట్టణంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద రాష్ట్ర సివిల్ సప్లయీస్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం సమ్మె చేపట్టారు
బెల్లంపల్లి, డిసెంబరు 15 : సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికుల రేట్లు పెంచాలని పట్టణంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద రాష్ట్ర సివిల్ సప్లయీస్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం సమ్మె చేపట్టారు. ఏఐటీయూసీ నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. ఏఐటీయూసీ నాయకులు మేకల దాసు, చిప్ప నర్సయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. జనవరి 1 నుంచి కొత్త రేట్లు కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతామని సివిల్ సప్లయీస్ కమిషనర్ అంగీకరించినా ఇప్పటి వరకు రేట్లు అమలు కాలేదన్నారు. వెంటనే హమాలీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులు రమేష్, రవి, చంద్రశేఖర్, మొగిలి, సతీష్, నారాయణ, సత్తయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.