ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-15T01:52:50+05:30 IST

ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు.

ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి
వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్‌, అధికారులు

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 14 : ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ఆయన సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి.రవికిషన్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో ఓటరు నమోదు, సవరణలకు సంబంధించిన ఫారం 6, 7, 8, ఆన్‌లైన్‌ డేటాఎంట్రీ ఓటరు జాబితా రూప కల్పనపై వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులను డిజిటలైజేషన్‌ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీజిల్లాలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ కొరకు వచ్చిన దర ఖాస్తులను డిసెంబరు 26 లోపు పరిశీలించి డిస్పోజ్‌ చేయాలని, అర్హత కలిగి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఆయన సూచించారు. ఉపాధి దృష్ట్యా కొంత మంది పట్టణాల్లో జీవిస్తున్నప్పటికీ గ్రామాల్లో వారికి ఓటుహక్కు ఉం టుందని, రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వివరాలు పరిశీలించి, అధికారులతో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి ఈఆర్‌వోలు చర్య తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయని, అధిక సంఖ్యలో ఓటరు నమోదు ప్రక్రియ జరిగే అవ కాశం ఉందని, ప్రస్తుతం పకడ్బందీగా ఓటరు జాబితా సిద్ధం చేస్తే, ఎన్నికల సమయంలో ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న జనాభాకు ఓటర్ల నిష్పత్తి, ఓటర్లలో జెండర్‌ నిష్పత్తి ఎన్నికల కమిషన్‌ మార్గ దర్శకాల మేరకు ఉండే విధంగా కృషి చేయాలని సూచించారు. ఓటరు నమోదు సమయంలో ట్రాన్స్‌జెండర్లు, సెక్స్‌వర్కర్లు వివిధ ప్రత్యేక వర్గాలతో సమావేశాలు నిర్వహించామని, వారందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులందరికీ ఓటు హక్కు కల్పించి, పోలింగ్‌ కేంద్రాల వారీగా మ్యాపింగ్‌ చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వంద సంవత్సరాలు నిండిన ఓటర్ల సంఖ్య 6149 ఉందని, క్షేత్ర స్థాయిలో సదరు వివరాలను మరోసారి ధృవీకరించాలని ఆయన సూచించారు. ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించేందుకు అవ సరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌లను ఆదేశించారు. అనం తరం అధికారులతో జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ... జిల్లాలోని నియోజక వర్గాల వారీగా అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు తప్పనిసరిగా కావాలని, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయాలని అన్నారు. డిసెంబరు 15 లోగా నిర్మల్‌, ఖానాపూర్‌, ముథోల్‌ నియోజకవర్గంకు సంబంధించిన ఫారం-6 దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా ఈఆర్‌వో, ఏఈ ఆర్‌వోలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారం -7, ఫారం -8లను నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌వో ఇన్‌చార్జి లోకేష్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు స్రవంతి, రవికుమార్‌, సురేష్‌, తహసీల్దార్‌ సుభాష్‌ చందర్‌, డీటీ రాకేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:52:52+05:30 IST