పేద ప్రజలకు సేవ చేయడమే ధ్యేయం

ABN , First Publish Date - 2022-09-29T04:27:23+05:30 IST

నియోజకవరంలోని పేద ప్రజలందరికీ సేవ చేయడమే ధ్యేయమని డీసీసీ అధ్యక్షురాలు, కొక్కిరాల రఘపతిరావు ట్రస్టు ప్రధాన కార్యదర్శి సురేఖ అన్నారు.

పేద ప్రజలకు సేవ చేయడమే ధ్యేయం
కన్నెపల్లిలో బతుకమ్మ చీరలను అందజేస్తున్న డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

- డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

దండేపల్లి, సెప్టెంబరు 28: నియోజకవరంలోని పేద ప్రజలందరికీ సేవ చేయడమే ధ్యేయమని డీసీసీ అధ్యక్షురాలు, కొక్కిరాల రఘపతిరావు  ట్రస్టు ప్రధాన కార్యదర్శి  సురేఖ అన్నారు. దండేపల్లి మండలంలో కన్నెపల్లి, గూడెం,నర్సాపూర్‌ గ్రామాల్లోని బుధవారం రఘపతిరావు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గడ్డం నాగరాణి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, శకుంతల, రజిత, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్‌, సర్పంచులు పుష్పలత, శంకరమ్మ, శంకరయ్య, నాయకులు నగేష్‌, తిరుపతి, సత్యనారాయణ, గురువయ్య, వేణు, శంకరయ్య. మహేష్‌, వెంకటేష్‌, మొగిళి, రాజయ్య,లక్ష్మణ్‌, మహిళలు పాల్గొన్నారు. 

Read more