అందరికీ ఆదర్శప్రాయుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌

ABN , First Publish Date - 2022-03-05T07:16:28+05:30 IST

దళిత బహుజునుల హక్కుల కోసం పోరాడిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అందరికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అన్నారు.

అందరికీ ఆదర్శప్రాయుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌
సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

ముథోల్‌, మార్చి, 4 : దళిత బహుజునుల హక్కుల కోసం పోరాడిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అందరికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన ముథోల్‌లో గౌడసంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని మోకు దెబ్బ జాతీ య అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల హక్కుల కోసం సర్వాయి పాపన్న పోరాడార ని పేర్కొన్నారు. ఆయన జీవితచరిత్రను స్పూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పేర్కొన్నారు గౌడసమాజం అభ్యున్నతికి ప్రభుత్వం సైతం కృషి చేస్తుందని వెల్ల డించారు. మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్‌ మాట్లాడుతూ హక్కుల సాధన కోసం గౌడ సోదరులు ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచిం చారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తుం దన్నారు. సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా గౌడ సోదరులు ఎదిగినప్పుడు సమాజంలో గుర్తింపు లభిస్తుందని వివరించారు. బహుజన రాజ్యం కోసం నిజం పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భూస్వాములతో కొట్లాడిన గొప్ప పోరాట యోధుడు సర్వాయిపాపన్న అని అన్నారు. మోగులాయిలను ఎదిరించిన మొట్ట మొదటి తెలంగాణ రాజు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అని పేర్కొన్నారు. 33 రాజ్యాలను స్థాపించిన బడుగుల ఆశాజ్యోతి ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జాతీయ అఽ ద్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దోరా రామగౌడ్‌, తెరాస మండల అధ్యక్షుడు అప్రోజ్‌ఖాన్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ వెంకటేష్‌ గౌడ్‌, మాజీ పీఏ సీఎస్‌ చైర్మెన్‌  సురేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్‌, సర్పంచ్‌ వెంకటా పూర్‌ రాజేంధర్‌, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌, ఎంపిడివో సురేష్‌బాబు, ఎంపీటీసీలు దేవోజీ భూమేష్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నారాగౌడ్‌, మాజీ ఏఎంసీ మురళిగౌడ్‌, డా. ముష్కం రామకృష్ణ గౌడ్‌, తెలంగాణ గౌడ సంఘం జిల్లా కార్యదర్శి ఫణిందర్‌ గౌడ్‌, విగ్రహాదాత దేవెందర్‌ గౌడ్‌, ఏ , ముళిగౌడ్‌, అంజగౌడ్‌, నగేష్‌ గౌడ్‌, శంకర్‌ గౌడ్‌, సత్యనారాయణగౌడ్‌, కనకాగౌడ్‌, స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more