హాస్టల్‌ విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2022-08-05T04:08:24+05:30 IST

జిల్లాలోని గురు కులాలు, సంక్షేమ హాస్టళ్ళలో చదువుకుంటున్న విద్యా ర్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బీసీ వెల్ఫేర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొ న్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలి కల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బీసీ ఇంటి గ్రేటెడ్‌ హాస్టల్‌లను సందర్శించారు. ఆయన మాట్లాడు తూ హాస్టల్‌ పరిధిలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉం డేలా చూడాలని, వంట శాల, సామగ్రి భద్రపరిచే గదులను శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు.

హాస్టల్‌ విద్యార్థుల ఆరోగ్యంపై  శ్రద్ధ వహించాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న డైరెక్టర్‌

 మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు  4: జిల్లాలోని గురు కులాలు, సంక్షేమ హాస్టళ్ళలో చదువుకుంటున్న విద్యా ర్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బీసీ వెల్ఫేర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొ న్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలి కల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బీసీ ఇంటి గ్రేటెడ్‌ హాస్టల్‌లను సందర్శించారు. ఆయన మాట్లాడు తూ హాస్టల్‌ పరిధిలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉం డేలా చూడాలని, వంట శాల, సామగ్రి భద్రపరిచే గదులను శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. పనుల పర్యవేక్షణకు  ప్రత్యేక అధికారిని నియమించామని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటిం చాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, వైద్య పరంగా నిరంతరం పర్యవేక్షిస్తూ మందులు అందించాలని సూచించారు.  బీసీ వెల్ఫేర్‌ అధికారి వినోద్‌కుమార్‌, భాగ్యవతి, వెంకటేశం, రాణి, తదితరులు పాల్గొన్నారు.  

కోటపల్లి: మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వస తి గృహాన్ని గురువారం జిల్లా షెడ్యూల్‌ కులాల అభి వృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి సందర్శించారు. ఈ సం దర్భంగా వసతి గృహం సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గదులు సరిపోవడం లేదని, విద్యార్థులు తెలపగా త్వరలోనే సమస్య పరిష్కారమ వుతుందని, అదనంగా రెండు గదులను తీసుకుంటు న్నామని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం అందిం చాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. వసతి గృహం విద్యార్థులు బాగా చదివి రాణించాలని కోరారు. కార్యక్రమంలో వార్డెన్‌ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత 

జైపూర్‌: మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండల కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం 7, 8, 9 తరగతుల విద్యార్థులకు స్నాక్స్‌గా బిస్కెట్లు ఇచ్చామని ప్రిన్సిపాల్‌ బాల భాస్కర్‌ పేర్కొన్నారు. అనంతరం కొంత సేపటికి 7, 8 తరగతులకు చెందిన 12 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతుండడంతో వెంటనే 108 అంబు లెన్స్‌ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చినట్లు తెలిపారు. బిస్కెట్‌లు తిన్న మిగితా విద్యార్థులందరు ఆరోగ్యంగానే  ఉన్నట్లు ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-08-05T04:08:24+05:30 IST