జనవరి 15 నాటికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పంపిణీకి సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2022-11-25T01:13:12+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను సంక్రాంతి (15 జనవరి 2023) నాటికి పంపిణీకి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల, శాసనసభ వ్యవహారాల, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

జనవరి 15 నాటికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పంపిణీకి సిద్ధం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, అధికారులు

నిర్మల్‌ టౌన్‌, నవంబరు 24 : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను సంక్రాంతి (15 జనవరి 2023) నాటికి పంపిణీకి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల, శాసనసభ వ్యవహారాల, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరా బాద్‌ నుండి మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, హౌసింగ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సునీల్‌శర్మ, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో పంపి ణీకి సిద్ధంగా ఉన్న డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని తేదీ నిర్ణయించుకొని పంపిణీకి సిద్ధం చేయాల న్నారు. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 6686 డబుల్‌బెడ్‌రూమ్‌ మంజూరయాయని, అందులో గతంలో 395 పంపిణీ చేయడం జరిగిందని, మరికొన్ని శుక్రవారం 1248 ఇళ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మిగిలినవి సంక్రాంతి లోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అధికారులతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పురోగతిపై నివేదిక సమర్పించాలని, సంబంధిత అధికారులతో జిల్లాకు మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య, టెండర్‌ పూర్తయినవి, నిర్మాణం ప్రారంభమైన ఇళ్లు, వివిధ దశలలో ఉన్న నిర్మాణ ఇళ్ల వివరాలు, ఎంపిక సంపూర్ణ అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T01:13:13+05:30 IST