ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ కొత్త పాలకవర్గం

ABN , First Publish Date - 2022-03-06T03:53:29+05:30 IST

ఆసిఫాబాద్‌ మార్కెట్‌కమిటీ నూతనపాలకవర్గం శనివారం కొలువు దీరింది. ఈమేరకు మార్కెట్‌కమిటీ కార్యదర్శి సోనియా పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయిం చారు.

ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ కొత్త పాలకవర్గం
పాలకవర్గ సభ్యులచే ప్రమాణం చేయిస్తున్న కార్యదర్శి సోనియా

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 5: ఆసిఫాబాద్‌ మార్కెట్‌కమిటీ నూతనపాలకవర్గం శనివారం కొలువు దీరింది. ఈమేరకు మార్కెట్‌కమిటీ కార్యదర్శి సోనియా పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయిం చారు. మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా గాదవేణి మల్లేష్‌, వైస్‌చైర్మన్‌గా హనుమాండ్ల జగ దీష్‌, డైరెక్టర్లుగా తాళ్లశ్రీనివాస్‌గౌడ్‌, దాన్‌పల్లి శ్యాంరావు, ఇంగు మల్లేష్‌, మిట్టపోశన్న, ఉప్రేరోషన్‌, గాదే ప్రవీణ్‌ కుమార్‌, సాయిని కేదారి పదవీ బాధ్య తలు చేపట్టారు. అనంతరం మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సోనియా, కార్యాలయ సిబ్బంది సభ్యులను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు.

Read more