యూనిఫాం పోస్టుల్లో వయోపరిమితిని పెంచాలి

ABN , First Publish Date - 2022-05-20T04:51:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసు, ఇతర యూనిఫాం ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో వయో పరిమితిని ఐదు సంవత్సరాలు పెంచాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ఏవోకు వినతిపత్రం అందించారు. నాయకులు మాట్లాడుతూ పీఆర్‌సీ నివేదిక ప్రకారం వివిధ శాఖల్లో 1లక్షా91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రిపోర్టు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పోస్టులకు నోటిఫికేషన్‌లు విడు దల చేయడం దారుణమన్నారు.

యూనిఫాం పోస్టుల్లో వయోపరిమితిని పెంచాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

ఏసీసీ, మే 19 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసు, ఇతర యూనిఫాం ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో వయో పరిమితిని ఐదు సంవత్సరాలు పెంచాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ఏవోకు వినతిపత్రం అందించారు. నాయకులు మాట్లాడుతూ పీఆర్‌సీ నివేదిక ప్రకారం వివిధ శాఖల్లో 1లక్షా91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రిపోర్టు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పోస్టులకు నోటిఫికేషన్‌లు విడు దల చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో గడిచిన 11 సంవత్సరాలుగా గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌లు విడుదల కాలేదని, వేల మంది నిరుద్యోగ యువత గరిష్ట వయో పరిమితి దాటిపోయి అనర్హులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగాల జనరల్‌ కేటగిరికి 25 సంవత్సరాల వయోపరిమితి ఉందని, దీనిని పెంచి 5 సంవత్సరాల సడలింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ, రాజు, దేవేందర్‌, అశోక్‌, చక్రవర్తి పాల్గొన్నారు.

 

Updated Date - 2022-05-20T04:51:35+05:30 IST