పోడు గర్జనకు పిలుపునిచ్చిన ఆదివాసీలు

ABN , First Publish Date - 2022-06-08T04:24:26+05:30 IST

కోయపోచగూడకు చెందిన గిరిజన మహిళలపై ఫారె స్టు అధికారులు పెట్టిన కేసులను ఎత్తివేసి, జైల్‌లో ఉన్న మహిళలను విడు దల చేయాలని ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు దౌలత్‌రావు, వ్యవసాయ కార్మి క సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డిలు డిమాండ్‌ చేశారు. మంగళవారం కోయపోచగూడ సందర్శించి గిరిజన కుటుంబాలను పరామ ర్శించారు. అనంతరం పోడు గర్జనపై సమావేశం నిర్వహించారు.

పోడు గర్జనకు పిలుపునిచ్చిన ఆదివాసీలు
కోయపోచగూడలో పోడు గర్జనకు పిలుపునిస్తున్న నాయకులు

10న కోయపోచగూడ నుంచి పాదయాత్ర

13న ఉట్నూర్‌ ఐటీడీఏ ఎదుట ఆందోళన

దండేపల్లి, జూన్‌ 7: కోయపోచగూడకు చెందిన గిరిజన మహిళలపై ఫారె స్టు అధికారులు పెట్టిన కేసులను ఎత్తివేసి, జైల్‌లో ఉన్న మహిళలను విడు దల చేయాలని ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు దౌలత్‌రావు, వ్యవసాయ కార్మి క సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డిలు డిమాండ్‌ చేశారు.   మంగళవారం కోయపోచగూడ సందర్శించి గిరిజన కుటుంబాలను పరామ ర్శించారు. అనంతరం పోడు గర్జనపై సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పసిపిల్లల తల్లులను ఫారెస్టు అధికారులు జైలుకు పంపడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో ఫారెస్టు అధికారు లు చట్టాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఈనెల 10న కోయ పోచగూడ నుంచి ఐటీడీఏ ఉట్నూర్‌ వరకు పాదయాత్ర చేపట్టి, 13న ఆదివాసి పోరు గర్జన నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2006 అటవీ హక్కు చట్టం అమలు చేసి సాగు భూములు కేటాయించి హక్కుల పత్రాలను అంద జేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన మహిళలను వేధించిన డీఎఫ్‌వో, ఎఫ్‌ఆర్‌వోలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కమిటీ చైర్మన్‌గా రవీందర్‌, కన్వీనర్‌గా బాపురావు, కోట్నాక తిరుపతి, ప్రభాకర్‌, దుర్గు, రాజేష్‌, కాంతరావు, పున్నం, జంగు, అశోక్‌, ప్రకాష్‌, నరేష్‌లను ఎన్నుకున్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి, ఆదివాసి సేన జిల్లా అధ్యక్షుడు కట్నాక్‌ తిరుపతి, నాయకులు పద్మక్క, రవి, అశోక్‌ పాల్గొన్నారు.  

- ఆదివాసీ గిరిజనులపై ఫారెస్టు అధికారులు పెట్టిన కేసులను ఎత్తివేసి,  మహిళలను జైలు నుంచి విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్‌ డిమాండ్‌ చేశారు. కోయపోచగూడలో గిరిజన మహిళలను సీపీఐ నాయకులు కలిసి మద్దతు పలికారు. పోడు భూముల కోసం పోరాడుతున్న గిరిజన మహిళలపై అధికారులు దాడులు చేసి జైలుకు పంపించడం దుర్మార్గమన్నారు. సీఎం కేసీఆర్‌ గిరిజనుల సమస్యలను పరిష్క రిస్తామని హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. పోడు భూముల విషయంలో కలెక్టర్‌, ఐటీడీఏ పీవో స్పందించి హక్కు పట్టాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు రామడుగు లక్ష్మణ్‌, కలిందర్‌ అలీఖాన్‌, మేకల దాసు, రాజేష్‌, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.     

తాండూర్‌: దండేపల్లి మండలంలో పోడు భూములను సాగు చేస్తున్న  మహిళలను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ  సీపీఎం నాయకులు ఐబీలో ధర్నా చేపట్టారు. నాయకులు దాగం రాజారాం, వేల్పుల శంకర్‌లు మాట్లాడుతూ అరెస్టు చేసి జైలులో పెట్టిన మహిళలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

కోటపల్లి: పోడు రైతులపై అక్రమ కేసులు బనాయించిన ఫారెస్టు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎర్రాయిపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు  రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బోడెంకి చందులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం శ్రావణ్‌, జిల్లా కమిటీ సభ్యులు ఆత్రం చిన్నన్న, బాగాల సమ్మన్న, కార్మిక సంఘం నాయ కులు జక్కుల మారన్న పాల్గొన్నారు.    

Read more