స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-09-04T04:00:25+05:30 IST
జిల్లాలో సాంఘిక సంక్షేమ సంస్థలలో ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్న స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో గురుకుల్ గోడ ప్రతులను ఆవిష్కరించి కార్యక్రమ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణ, వంటశాల, భోజన శాల, తరగతి గదులు, మూత్ర శాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు భోజనా నికి ముందు చేతులు శుభ్రపరచుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 3: జిల్లాలో సాంఘిక సంక్షేమ సంస్థలలో ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్న స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో గురుకుల్ గోడ ప్రతులను ఆవిష్కరించి కార్యక్రమ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణ, వంటశాల, భోజన శాల, తరగతి గదులు, మూత్ర శాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు భోజనా నికి ముందు చేతులు శుభ్రపరచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో అవసరమైన ఫర్నీచర్, ఎలక్ర్టానిక్ సామగ్రి, కంప్యూటర్లు, సీసీ కెమెరాల మర మ్మతు చేయించాలన్నారు. ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించాలని, నాటిన మొక్కలను సంరక్షించాల న్నారు. దోమలు, కీటకాలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా మందులు వినియోగించాలని తెలిపారు. మొద టి రోజు వ్యర్ధాల తొలగింపు, రెండో రోజు పాఠశాల భవనం, మూడో రోజు మూత్రశాలలు, నీటి ట్యాంక్‌ల పరిశుభ్రత ఆవశ్యకతపై పోటీలు నిర్వహిస్తామన్నారు. నాల్గవ రోజు వంటశాల, భోజనశాల పరిశుభ్రత, ఐద వ రోజు మొక్కలు నాటడం, ఆరవ రోజున పారిశుఽ ద్యంపై సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచా రం ఉంటుందని, అధికారులు కార్యక్రమం విజయవం తానికి కృషి చేయాలన్నారు.
లక్షెట్టిపేట: మున్సిపల్ కార్యాలయంలో ఎంపీడీవో నాగేశ్వర్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ గురుకుల్ పోస్ట ర్‌లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ గురుకుల్ ప్రోగ్రాంను వారం రోజులపాటు నిర్వహిస్తా మన్నారు.
గురుకులాలు పరిశుభ్రంగా తయారవుతా యని, విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా కాపా డుకోవచ్చన్నారు. ఏపీవో, ప్రిన్సిపాల్ లలితకుమారి, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ మౌనిక, సూపరింటెండెంట్, కార్యదర్శి పాల్గొన్నారు.