విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకోవాలి

ABN , First Publish Date - 2022-09-25T07:05:40+05:30 IST

నేటి పోటీతత్వ యుగంలో దీటుగా రాణించేందుకు గాను విద్యార్థులందరూ సృజనాత్మక ధోరణి విధానాలను అలవర్చుకుని శాస్త్రీయ దృక్పదాన్ని పెంపొందించుకోవాలని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకోవాలి
లబ్ధిదారులకు చీరలు అందజేస్తున్న ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

భైంసా, సెప్టెంబరు 24 ; నేటి పోటీతత్వ యుగంలో దీటుగా రాణించేందుకు గాను విద్యార్థులందరూ సృజనాత్మక ధోరణి విధానాలను అలవర్చుకుని శాస్త్రీయ దృక్పదాన్ని పెంపొందించుకోవాలని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. భైంసాలోని సుభధ్రవాటిక శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న గణితవిజ్ఞానమేళా శనివారంతో ముగిసింది. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.  శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగితే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతుందన్నారు. తద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలపై పట్టు  పెంపొంది ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా గణిత విజ్ఞానమేళాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్‌, ఆదాయ పన్ను అధికారి ప్రకాష్‌ రాథోడ్‌, శిశు మందిరాల ప్రాంత శైక్షానిక్‌ ప్రముఖ్‌ కృష్ణమాచార్యులు, డీసీసీ మాజీ అధ్యక్షులు దిగంబర్‌ మాశెట్టివార్‌, భైంసా డాక్టర్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు దామోదర్‌ రెడ్డిలు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. 

బతుకమ్మ చీరల పంపిణీ

భైంసా రూరల్‌, సెప్టెంబరు 24 : మండలంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించు కోవాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు అనేక సంక్షేమ పథకాలు చేకూరుస్తుందని తెలిపారు. ప్రతిగ్రామంలో నేటి నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్‌, ఎంపీపీ కల్పన జాదవ్‌, వైస్‌ ఎంపీపీ గంగాధర్‌, ఐకేపీ లక్ష్మణ్‌, ఎంపీవో మోజాం హుస్సేన్‌, కోఆపరేషన్‌ సభ్యుడు గజేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు సోలంకి భీంరావు, గణేష్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు. 

Read more