అక్రమ లే అవుట్లపై కఠినంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2022-09-28T03:51:08+05:30 IST

మండలాల్లోని గ్రామపంచాయతీల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ లే అవుట్లపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో డీఎల్‌పీవో ప్రభాకర్‌ రావుతో కలిసి లక్షెట్టిపేట, మందమర్రి, హాజీపూర్‌ మండల పంచాయతీ అధికా రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

అక్రమ లే అవుట్లపై కఠినంగా వ్యవహరించాలి
ఎంపీడీవో కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతున్న డీపీవో నారాయణరావు

హాజీపూర్‌, సెప్టెంబరు 27: మండలాల్లోని గ్రామపంచాయతీల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ లే అవుట్లపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో డీఎల్‌పీవో ప్రభాకర్‌ రావుతో కలిసి లక్షెట్టిపేట, మందమర్రి, హాజీపూర్‌ మండల పంచాయతీ అధికా రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. డీపీవో మాట్లాడుతూ పంచా యతీల్లో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అనుమతులు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నోటీసులు జారీ చేయడంతోపాటు హద్దురాళ్లను తొల గించాలన్నారు. అన్ని అంశాలు నిర్ధారించుకున్న తర్వాతనే ఇంటి అనుమతులు ఇవ్వాలన్నారు. ఎంపీడీవో ఎంఏ హై, ఎంపీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2022-09-28T03:51:08+05:30 IST