పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-05-19T04:31:31+05:30 IST

పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. మండలంలోని బాబాసాగర్‌, డబ్బా, చింతలమానేపల్లి, కర్జెల్లి గ్రామాల్లో బుధవారం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

-  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

చింతలమానేపల్లి, మే 18: పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. మండలంలోని బాబాసాగర్‌, డబ్బా, చింతలమానేపల్లి, కర్జెల్లి గ్రామాల్లో బుధవారం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆయాగ్రామాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లా డుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వహయాంలోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరు గుతోందన్నారు. అందరి సహకారంతో పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, కాగజ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ డోకె రాజన్న, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు డుబ్బుల వెంకయ్య, కో ఆప్షన్‌ సభ్యుడు నాజీమ్‌ హుస్సేన్‌, ఎంఈవో సోమయ్య, పాఠశాల చైర్మన్‌ చౌదరి అంజన్న, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటీసీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read more