విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-14T04:07:41+05:30 IST

జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీ, వసతిగృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం కలెక్టరే ట్‌లో ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపుకలెక్టర్‌ చాహ త్‌బాజ్‌పాయితో కలిసి విద్యార్థులకు కల్పిస్తున్న సౌక ర్యాలు, సిబ్బంది పనితీరుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 13: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీ, వసతిగృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం కలెక్టరే ట్‌లో ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపుకలెక్టర్‌ చాహ త్‌బాజ్‌పాయితో కలిసి విద్యార్థులకు కల్పిస్తున్న సౌక ర్యాలు, సిబ్బంది పనితీరుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పాఠశా లల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు, తాగునీరు, భోజనశాల, మెనూప్రకారం ఆహారంఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. సీజనల్‌ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థుల కు అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహిం చేందుకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికా రులు సిద్ధంగా ఉండాలన్నారు. విద్యార్థుల గైర్హాజరు, ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేకఅధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని, మిషన్‌ భగీరథ తాగునీరు అందేలాచర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అందించే మెనూ వివరాలను నోటీసుబోర్డులో ఉంచా లని తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

జైనూరు: సంక్షేమహాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై సిబ్బంది ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. మంగళవారం స్థానికఆశ్రమోన్నత పాఠశాల ను ఆయన తనిఖీచేశారు. ఈసందర్భంగా వంటశాల ను పరిశీలించి, మెనూ విధానాన్ని ఇన్‌చార్జి హెచ్‌ఎం నాయక్‌ను అడిగి తెలుసుకు న్నారు. అంతకు ముందు మండలంలోని జనగాంలో ఈనెల24న ట్రైనీ కలెక్టర్‌లు వస్తున్నందున వారికి కావాల్సిన సదుపాయాలను గ్రామకార్యదర్శి మధుకర్‌, వైస్‌ఎంపీపీ లక్ష్మణ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా జనగాంలోని మండ లపరిషత్‌ పాఠశాల విద్యావలంటీర్లు తమకు గౌరవ వేతనం సక్రమంగా అదడంలేదని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అలాగే పోచంలొద్ది కేజీబీవీని కలెక్టర్‌ సందర్శించారు. పాఠశాల గేటుకు తాళం వేసి ఉండడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంఽ దిత ప్రత్యేకాధికారి పనితీరుపై సమగ్రంగా దర్యాప్తు చేసి తుది నివేదికలు అందజేయాలని తహసీల్దార్‌ సాయన్నను ఆదేశించారు.

Read more