ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-10-18T03:33:25+05:30 IST
ప్రజారోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని రైతువేదికలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బోధకాల వ్యాధినివారణపై వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పెంచికలపేట, అక్టోబరు 17: ప్రజారోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని రైతువేదికలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బోధకాల వ్యాధినివారణపై వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 2030సంవత్సరం నాటికి బోధకాల వ్యాధి నిర్మూల నకు కృషిచేయాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు సీతారాం, సుధాకర్ నాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.