పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ABN , First Publish Date - 2022-07-06T04:21:09+05:30 IST

లింగాపూర్‌ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌ తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌లో రిసెప్షన్‌ కౌంటర్‌, తదితర పరిసరాలను సందర్శించారు.

పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
లింగాపూర్‌ పోలీసు స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

లింగాపూర్‌, జూలై 5:లింగాపూర్‌ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌ తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌లో రిసెప్షన్‌ కౌంటర్‌, తదితర పరిసరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సీఐ రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్లవాయి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ రామకృష్ణ, ఎస్సైలు మధుకర్‌, ప్రవీణ్‌, రాజు, సర్పంచ్‌ ప్రతిభ ఉన్నారు. 

చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తాం

జైనూరు, జులై 5: గిరిజన ప్రాంతంలో ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మార్లవాయి గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించి సర్పంచ్‌ కనక ప్రతిభ, డిఎస్పీ శ్రీనివాస్‌ తదితరులతో కలిసి గ్రామంలో మొక్కలు నాటారు.  నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఆనంతరం హైమన్‌డార్ఫ్‌ దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఆనంతరం ఎస్పీ జైనూరు, లింగాపూర్‌, సిర్పూర్‌(యూ), పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు. ఆయన వెంట సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ మధుకర్‌ తదితరులు ఉన్నారు.\


Read more