బీఆర్‌ఎస్‌కు రూ.66 వేల సోయా పంట విరాళం

ABN , First Publish Date - 2022-10-07T06:07:48+05:30 IST

బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీకి రూ.66 వేల విలువగల సోయా పంటను ముఖ్ర(కె) దళిత బస్తీ వాసులు విరాళంగా అందించారు.

బీఆర్‌ఎస్‌కు రూ.66 వేల సోయా పంట విరాళం

ఇచ్చోడరూరల్‌, అక్టోబరు6: బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీకి రూ.66 వేల విలువగల సోయా పంటను ముఖ్ర(కె) దళిత బస్తీ వాసులు విరాళంగా అందించారు. దేశంలో ఎన్నో కుటుంబాలకు పెద్ద దిక్కు కేసీఆర్‌ ఆదుకుం టారని, టీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటించినందుకు ఆనందంగా  విరాళం ప్రకటించామని దళిత కుటుంబాలు తెలిపారు. ముఖ్ర(కె) గ్రామంలో 33 మంది దళిత కుటుంబాలకు 99ఎకరాలు భూమి దళితబస్తీ కింద సీఎం కేసీఆర్‌ ఇచ్చా రన్నారు. కూలీలుగా ఉన్న తమని రైతుగా మార్చిన కేసీఆర్‌కి జీవితాంతం రుణపడి ఉం టామని వారి పంట పొలాల్లో వెళ్లిన సోయా పంటను మనిసికి 50కిలోల చొప్పున 16.50 క్వింటాళ్ల సోయాను సోయాను బీఆర్‌ఎస్‌ పా ర్టీకి విరాళంగా ప్రకటించి కేసీఆర్‌కు పంపా ల్సిందిగా ముఖ్ర(కె) సర్పంచ్‌ గాడ్గెమీనాక్షికి అందజేశారు. ఈ సందర్భంగా సోయం పంటలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గెసుభాష్‌, తిరుపతి, సం జీవ్‌, మహిళలు, దళిత కుటుంబాలు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T06:07:48+05:30 IST