జిల్లాలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-12-10T01:59:39+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రదాయిని సోనియా గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రిమ్స్‌ ఆసుపత్రిలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

జిల్లాలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
రిమ్స్‌లో రక్తదానం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 9: తెలంగాణ రాష్ట్ర ప్రదాయిని సోనియా గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రిమ్స్‌ ఆసుపత్రిలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు సాజీద్‌ఖాన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సోనియాగాంధీ చొరవతో సాధ్యమైందన్నారు. ఆమె జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని, జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇందులో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దిగంబర్‌ రావు పాటిల్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అల్లూరి సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:59:44+05:30 IST