ఆధార్‌ సెంటర్ల నిర్వాహకులకు సాఫ్ట్‌ ట్రైనింగ్‌

ABN , First Publish Date - 2022-08-12T05:21:51+05:30 IST

యూఐడీఏఐ యూనిక ఐడెంటిఫికేసన్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర హైదరాబాద్‌ రీజినల్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ మహమ్మద్‌సౌభన్‌ ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లా ఆధార్‌ సెంటర్‌ ఆపరేటర్స్‌కు కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ట్రైనింగ్‌, సాఫ్ట్‌ స్కీల్స్‌ ట్రైనింగ్‌ నిర్వహించారు.

ఆధార్‌ సెంటర్ల నిర్వాహకులకు సాఫ్ట్‌ ట్రైనింగ్‌

ఆదిలాబాద్‌టౌన్‌, ఆగస్టు11: యూఐడీఏఐ యూనిక ఐడెంటిఫికేసన్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర హైదరాబాద్‌ రీజినల్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ మహమ్మద్‌సౌభన్‌ ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లా ఆధార్‌ సెంటర్‌ ఆపరేటర్స్‌కు కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ట్రైనింగ్‌, సాఫ్ట్‌ స్కీల్స్‌ ట్రైనింగ్‌ నిర్వహించారు. ఆధార్‌ సెంటర్‌ సర్వీసెస్‌కువచ్చే సిటిజన్స్‌ స్టాండర్డ్‌ ఫార్మాట్‌ ప్రతీ ఆధార్‌ సెంటర్‌లో ఉన్న ఫార్మాట్‌లోనే డేటా నింపాలని, తారీఖు, సంతకం ఉండాలని సూచించారు. వారు సబ్మిట్‌ చేసి పత్రాలలో ఎటువంటి ఓవర్‌ రైటింగ్స్‌ కానీ వైటెనర్‌ ఇక నుంచి ఆధార్‌ ఫామ్‌లో చేయరాదని చెప్పారు. పుట్టిన తేదీ మార్పులు కేవలం రెండు సార్లు మాత్రమే సెంటర్‌ వద్ద అవుతాయని తెలిపారు. అందులో ఏమైనా మార్పులు అవసరం అయితే ఆ సమస్య రాష్ట్ర ఆఫీస్‌ యూఐడీఐలో సవరించుకోవాలని తెలిపారు. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌లో సరైన పత్రాలు పెట్టని యెడల ఆపరేటర్‌ సస్పెండ్‌ గురయ్యే అవకాశం ఉందని అని చెప్పారు. ఈ ట్రైనింగ్‌లో ఈడీఎం బండిరవి, టీఎస్‌టీఎస్‌ డీఎం నరసింహారావు,ఆధార్‌ ఆపరేటర్స్‌ నరేష్‌ యాదవ్‌, కర్నేభాస్కర్‌, తన్వీర్‌, మహేందర్‌, గడుగు,శ్రీదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:21:51+05:30 IST