శివ శంభో..

ABN , First Publish Date - 2022-03-01T07:13:37+05:30 IST

జిల్లావ్యాప్తంగా మంగళవారం మహాశివరాత్రి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఇప్పటికే స్థానిక శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ కేడ్లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోరి ఇచ్చోడ, జైనథ్‌, ఆదిలాబాద్‌, ఆదిలాబాద్‌ రూరల్‌, బోథ్‌, ఉట్నూర్‌, నేరడిగొండ, తలమడుగు,

శివ శంభో..
ఆదిలాబాద్‌లోని కొత్త కుమ్మరివాడలో ముస్తాబైన శివాలయం

నేడే మహాశివరాత్రి

వేడుకలకు సిద్ధమైన శైవక్షేత్రాలు

శివపార్వతుల దర్శనానికి బారులు తీరనున్న భక్తులు

జిల్లావ్యాప్తంగా శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

ఆదిలాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 28: జిల్లావ్యాప్తంగా మంగళవారం మహాశివరాత్రి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఇప్పటికే స్థానిక శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ కేడ్లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోరి ఇచ్చోడ, జైనథ్‌, ఆదిలాబాద్‌, ఆదిలాబాద్‌ రూరల్‌, బోథ్‌, ఉట్నూర్‌, నేరడిగొండ, తలమడుగు, తాంసి, తదితర ప్రధాన మండలాల్లోని శివాలయాలను విద్యుత్‌ కాంతులతో సిద్ధం చేశారు. పండుగకు   శైవక్షేత్రాలు సిద్ధం కాగా భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగనున్నాయి. త్రినేత్రున్ని స్మరిస్తూ భక్తి పారవశ్యంతో మునిగిపోనున్నారు. శివపార్వతులకు ప్రత్యేక పూజలు  నిర్వహించేందుకు శైవక్షేత్రాలకు భక్తులు బారులు తీరనున్నారు. అయితే పలుచోట్ల కరోనా నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. 

ఫ వేడుకలకు సిద్ధమైన ఆలయాలు

జిల్లాలోని ఆలయాల కమిటీ సభ్యులు పండుగను పురస్కరించుకుని ఆలయాలను ముస్తాబు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించారు. 

కాగా, ఆదిలాబాద్‌ పట్టణంలోని గంగపుత్ర సంఘం శివాలయంలో మహా శివరాత్రిని పురస్కరించుకొని సోమవారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్దసంఖలో హాజరయ్యారు.  

ముస్తాబైన శివ మార్కండేయ ఆలయం 

బోథ్‌: మండలకేంద్రంలోని శివ మార్కండేయ ఆల యం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేయనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని ప్రతియేటా రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించి భక్తులతో భజన కార్యక్రమాలను రాత్రిపూట నిర్వహించి జాగారం చేయనున్నారు. తెల్లవారు జామున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు.  

కోరికలు తీర్చే ఝరి రాజరాజేశ్వరుడు

తలమడుగు: మండలంలోని ఝరి గ్రామంలో గల అతిపురాతనమైన శ్రీరాజరాజేశ్వర ఆలయం మహాశివరాత్రి పండుగకు ముస్తాబు చేశారు. శ్రీరాజరాజేశ్వర ఆల యం భక్తుల కొండుబంగారంగా విరాజిల్లుతోంది. భక్తుల కోరికలను తీర్చే మహిమ గల మహాశివ పార్వతుల విగ్రహాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. వేములవాడలో రాజేశ్వర ఆలయం నిర్మించిన సమయంలో ఝరిలో ఇక్కడ ఆలయం నిర్మించారని పూర్వికులు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ప్రతీయేడు శివరాత్రికి మూడు రోజుల పాటు మహా పండితులతో యజ్ఞ కార్యక్రమాలు, శివపార్వతుల కల్యాణం,రథోత్సవం, జాతరను నిర్వహిస్తున్నారు. 

..అడవిలో వెలసిన కైలాస్‌ టేకిడి

బోథ్‌ రూరల్‌: మండల పరిధిలోని నిగిని గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో వెలసిన శిఖర్‌ కైలాస్‌ టేకిడి నర్మదేశ్మర్‌ ఆలయం మంగళ, బుధవారాలలో జరుగనున్న మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల భక్తులే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ వ్యవస్థాపకులు సంత్‌ లింబాజి మహారాజ్‌ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు అన్నిఏర్పాట్లను పూర్తి చేశారు. 

..కాకతీయుల కాలం నాటి..

ఉట్నూర్‌: మహా శివ రాత్రి వేడుకల కోసం శివ మందిరాలు ముస్తాబు అయ్యాయి. ఉట్నూర్‌ మండలంలోని పాత ఉట్నూర్‌ వద్ద ఉన్న కాకతీయుల కా లం నాటి శివాలయం, మం డలంలోని సాలేవాడ(కే)లో ఉన్న శివాలయాలు శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ముస్తాబు చేశారు. పండుగ రోజున భక్తులు శివలింగానికి  పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేశామని ఆలయ పూజారులు తెలిపారు. కాగ, సోమవారం నుంచే భక్తులు సాలేవాడ శివాలయానికి చేరుకోని పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-03-01T07:13:37+05:30 IST