రూ.11 లక్షల విలువ గల గుట్కా నిల్వల పట్టివేత

ABN , First Publish Date - 2022-01-23T05:47:49+05:30 IST

మహారాష్ట్ర నుంచి అక్రమంగా తెచ్చి ఆదిలాబాద్‌లో నిల్వ ఉంచిన రూ.11లక్షల గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

రూ.11 లక్షల విలువ గల గుట్కా నిల్వల పట్టివేత


ఆదిలాబాద్‌, జనవరి22 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర నుంచి అక్రమంగా తెచ్చి ఆదిలాబాద్‌లో నిల్వ ఉంచిన రూ.11లక్షల గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రం సమీపంలోని చాందా(టి) గ్రామ మైనార్టీ పాఠశాల వద్ద అనుమానాస్పదంగా ఉన్న సాజిద్‌దుల్లాఖాన్‌ను విచారించగా పాఠశాల సమీపంలో ఉన్న మడిగెలో గుట్కా నిల్వలు బయట పడ్డాయని తెలిపారు. దీని విలువ రూ.11లక్షల 15వేల 800లు ఉం టుందని తెలిపారు. దీంతో నిందితున్ని అదుపులోకి తీసుకుని 270, 273 ఐపీసీ సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

Read more