శ్మశాన వాటిక స్థలం కొనుగోలులో కుంభకోణం: ప్రేంసాగర్‌రావు
ABN , First Publish Date - 2022-06-06T04:09:52+05:30 IST
పట్టణంలోని కాలేజీ రోడ్డు గోదావరి తీరంలో శ్మశాన వాటిక నిర్మాణానికి స్థలం కొనుగోలులో ఆర్థిక కుంభకోణం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆరోపించారు. ఆదివారం కొనుగో లు చేసిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్మశాన వాటిక స్థలం కొనుగోలులో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రమేయం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా గోదావరి నీటిలో మునిగే ఎకరం స్థలానికి రూ. 1.20 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
ఏసీసీ, జూన్ 5: పట్టణంలోని కాలేజీ రోడ్డు గోదావరి తీరంలో శ్మశాన వాటిక నిర్మాణానికి స్థలం కొనుగోలులో ఆర్థిక కుంభకోణం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆరోపించారు. ఆదివారం కొనుగో లు చేసిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్మశాన వాటిక స్థలం కొనుగోలులో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రమేయం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా గోదావరి నీటిలో మునిగే ఎకరం స్థలానికి రూ. 1.20 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. గోదావరి తీరాన ఎకరానికి రూ. 35 లక్షలకు ఇటీవల ఓ వ్యక్తి స్థలం కొనుగోలు చేశాడని, పక్కనే ఉన్న టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌కు చెందిన స్థలాన్ని శ్మశాన వాటిక కోసం రూ.1.20 కోట్లకు ఎలా కొనుగోలు చేస్తారని నిలదీశారు. నీటిలో మునిగిపోయే స్థలానికి అంత డబ్బు పెట్టి కొనుగోలు చేయడం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్మశాన వాటిక నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ప్రముఖులు, వ్యాపారుల నుంచి సేకరించిన విరాళాలు ఒకరిద్దరి జేబుల్లోకి వెళ్లడం సహించబోనన్నారు. గుండ సుధాకర్ అతని తండ్రి స్మారకార్ధం శ్మశాన వాటిక నిర్వహిస్తుండగా, దాని పక్కన కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. శ్మశాన వాటిక నిర్మాణానికి కేంద్రం రూ. 2కోట్లు కేటాయించిందని, ఈ నిధులను విరాళాలతో కొనుగోలు చేసిన స్థలంలో వెచ్చిస్తే ఉద్యమిస్తామన్నారు. గోదావరి ఒడ్డున నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలోకి వర్షాకాలంలో బ్యాక్ వాటర్ వస్తే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. పీసీసీ మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్, కౌన్సిలర్ పూదరి సునీత, నాయకులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.