జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

ABN , First Publish Date - 2022-01-04T05:04:02+05:30 IST

ఆసిఫాబాద్‌ పట్ట ణంలో సోమవారం సావిత్రి బాయిఫూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌, మాలిసంఘం, బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో, అలాగే కోర్టు ఆవ రణ, ఇంటర్‌విద్యా కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసంద్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు.

జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి ఫూలే జయంతి
కోసినిలో సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోనప్ప

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 3: ఆసిఫాబాద్‌ పట్ట ణంలో సోమవారం సావిత్రి బాయిఫూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌, మాలిసంఘం, బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో, అలాగే కోర్టు ఆవ రణ, ఇంటర్‌విద్యా కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసంద్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆయాకార్యక్రమాల్లో ఎంపీ డీవో శశికళ, సింగిల్‌విండో చైర్మన్‌ అలీబీన్‌అహ్మద్‌, ఇంటర్‌ విద్యాధికారి శ్రీధర్‌సుమన్‌, ప్రిన్సిపాల్‌ రాం దాస్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లాఅధ్యక్షుడు డాక్టర్‌ రమేష్‌, మాలిసంఘంఅధ్యక్షుడు శంకర్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేశవరావు,బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌బాబు పాల్గొన్నారు.

విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోనప్ప

కాగజ్‌నగర్‌: మండలంలోని కోసినిలో సావిత్రిబాయిఫూలే విగ్రహాన్ని ఎమ్మెల్యే కోనప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రి బాయి ఫూలే ఆశయాల సాధన కోసం అంతా కృషిచేయాలని పిలుపునిచ్చారు. 

కాగజ్‌నగర్‌: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సిర్పూరు నియోజకవర్గం ఇన్‌చార్జీ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమాల్లో రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు, కృష్ణస్వామి, తదితరులు పాల్గొన్నారు. అలాగే చైతన్య దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.సంఘంఅధ్యక్షుడు ఎండీఖయ్యూం పాల్గొన్నారు.

రెబ్బెన: మండలంలోని నవేగాంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో  సావిత్రి బాయి ఫూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పాసిగాంలో ఎంపీపీ సౌందర్య పాల్గొని సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేశారు.

బెజ్జూరు: మండలంలో బీఎస్పీయూత్‌ అధ్యక్షుడు శంకర్‌ సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. 

తిర్యాణి: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఈవో వెంకటేశ్వరస్వామి, ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌రావు, ప్రధానో పాధ్యాయుడు రాము, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి): మండలంలోని జ్యోతినగర్‌, బస్టాం డు ఏరియాలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మాలి కులస్తులు పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి: మండలకేంద్రంలో మాలి సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

కెరమెరి: మండలకేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

జైనూరు:మండలకేంద్రంలో మాలిసంఘం నాయ కులు సావిత్రిబాయిఫూలె చిత్రపటాలకు పూలమా లలు వేసి నివాళులు ఆర్పించారు. మాలిసంఘం అధ్యక్షుడు పెట్కులెహుస్సేన్‌, సర్పంచ్‌మేస్రాం పార్వ తీబాయి, ఇంతీయాజ్‌లాల, సర్పంచులసంఘం మండలాధ్యక్షుడు మడావిభీంరావ్‌ ఉన్నారు.

వాంకిడి: మండలంలోని కిరిడి, కోమటిగూడ, వాంకిడి ప్రభుత్వజూనియర్‌కళాశాలలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటాలకు ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ప్రోగ్రాం అధికారి చంద్రయ్య, ప్రిన్సిపాల్‌ సంపత్‌కుమార్‌, ఎంఈవో మనుకుమార్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్‌ పాల్గొన్నారు. 

Read more