పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలి
ABN , First Publish Date - 2022-12-16T22:26:23+05:30 IST
గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని అదనపు కలె క్టర్ రాహుల్ పేర్కొన్నారు. శుక్రవారం నీల్వాయిలో పర్యటించారు. డంపింగ్ యార్డును పరిశీలించి పరి సరాల్లో ఉన్న చెత్తను తీసివేయాలని సూచించారు.
వేమనపల్లి, డిసెంబరు 16: గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని అదనపు కలె క్టర్ రాహుల్ పేర్కొన్నారు. శుక్రవారం నీల్వాయిలో పర్యటించారు. డంపింగ్ యార్డును పరిశీలించి పరి సరాల్లో ఉన్న చెత్తను తీసివేయాలని సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కార్యదర్శులు ఉదయం 7 గంటలకు విధులకు హాజరై పారిశుధ్య పనులను చేయించాలన్నారు. సిబ్బంది రోజు ఇంటిం టికి వెళ్ళి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తర లించాలన్నారు. తడి చెత్త ద్వారా వర్మీకంపోస్టు తయారు చేసి రైతులకు, హరితహారం మొక్కలకు వినియోగించాలన్నారు. నర్సరీ పనులను వేగవం తంగా పూర్తి చేయాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని, ఇంటి పన్నులను వంద శాతం వసూలు చేయాలన్నారు. క్రీడా మైదానాలకు స్థలా లను కేటాయించాలని తహసీల్దార్‌కు సూచించారు. సర్పంచు గాలి మధు, ఎంపీడీవో లక్ష్మయ్య, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీవో బాపురావు, ఏపీవో సత్యప్రసాద్, సిబ్బంది ఉన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
కన్నెపల్లి: ఉపాధ్యాయులు సమయపాలన పా టించాలని అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు. మండల కేం ద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి పరిస రాలను పరిశీలించి విద్యార్థులతో మా ట్లాడారు. ఉపా ధ్యాయులు విద్యార్థు లను నిష్ణాతు లుగా తీర్చిదిద్దాల న్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. అనంతరం జన్కా పూర్లోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిం చారు. వనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని, రోజు మొక్కలకు నీరు పోయాలని సూచించారు. ఎంపీ డీవో రాధాకిషన్, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.