జిల్లా సమగ్రతకు పునరంకితం

ABN , First Publish Date - 2022-08-16T06:55:36+05:30 IST

పోరాడి సాధించుకున్న తెలంగా ణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జిల్లా సమగ్రతకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో సోమవారం నిర్వహించిన 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు. ఇందులో భాగంగా జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, ఉమ్మడి ఆదిలా బాద్‌ డీసీసీబీ

జిల్లా సమగ్రతకు పునరంకితం
జాతీయ జెండాను ఎగుర వేస్తున్న విప్‌ గంప గోవర్ధన్‌

అన్నదాతకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

రైతు బంధు, రైతు బీమాలతో ఆర్థిక చేయూత

విద్యా, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి

ప్రజా సంక్షేమం కోసం కొత్త పింఛన్లు ప్రారంభం

గ్రామాల్లోని మహిళా సంఘాలకు రుణ భరోసా

సంక్షేమ పథకాలకు పెద్దపీట

జాతీయ జెండా ఎగురవేసిన విప్‌ గంప గోవర్ధన్‌

పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

ఆదిలాబాద్‌ టౌన్‌, ఆగస్టు 15: పోరాడి సాధించుకున్న తెలంగా ణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జిల్లా సమగ్రతకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో సోమవారం నిర్వహించిన 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు  ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు. ఇందులో భాగంగా జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, ఉమ్మడి ఆదిలా బాద్‌ డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి,  ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులతో కలిసి విప్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. ముందుగా పరేడ్‌కు చేరుకున్న ఆయనకు ప్రత్యేక పోలీసులు కవాతుతో స్వా గతం పలికారు. అనంతరం వారి గౌరవ వందనం స్వీకరించిన విప్‌ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ.. ఎంతో మంది మహానీయుల త్యాగఫలమే ఈ స్వాతంత్య్రం అన్నారు. మరెందరో తమ ప్రాణాలను అర్పించి మన దేశానికి స్వాతంత్య్ర ఫలాలను అందించారని పేర్కొ న్నారు. వారి కృషి ఫలితంతోనే రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ను ఒక వేడుకగా పరిమితం చేయకుండా సరికొత్త తీర్మానాలతో కొత్త సంకల్పాల సాధనకు పునాదులు వేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఈ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆనాటి స్వాతంత్ర పోరాటాలు, జాతీయ భావన, జాతీ సమైక్యత వంటి అంశాలతో కూడిన గాంధీ చిత్రాన్ని స్థానిక సినిమా హాల్‌లో ప్రదర్శించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా  909 ప్రాంతాల్లో లక్షా 51వేల 567 మొక్కలు నాటడం, 783 ఫ్రీడమ్‌ పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందని విప్‌పేర్కొన్నారు. 

అన్నదాతకు అండగా ప్రభుత్వం

బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలుస్తోందని అన్నారు. వారు పండించిన పంటలను కొనుగోలు చేయడంతో పాటు పంటలు సాగు చేయడానికి రైతు బంధు పథకం అమలు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. అదేవిధంగా అటవీ హక్కు పత్రాలు కలిగిన జిల్లావ్యాప్తంగా లక్షా 47వేల 906 మంది రైతు లకు రూ.267 కోట్ల పంట పెట్టుబడి సాయం అందజేశామన్నారు. ఇప్పటి వరకు లక్షా 47వేల 297 మంది రైతులకు సామూహిక బీమా పథకం కింద అర్హులుగా గుర్తించామని తెలిపారు. వివిధ కారణాల వలన మరణించిన 1371 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున జిల్లాలో రూ.68కోట్ల 55లక్షలు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 49వేల 409 రైతు కుటుంబాలకు రూ.9కోట్ల 88లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. అంతేకాకుండా జిల్లాలో వారు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు 11 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతుధర కల్పించి, ఈ యేడాది 9లక్షల 33వేల 373 క్వింటాళ్ల పత్తి  కొనుగో లు చేశామన్నారు. 8 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 264 మంది రైతుల నుంచి 2034 క్వింటాళ్లను, 8శనగ కేం ద్రాల ద్వారా 21వేల 951 మంది రైతుల నుంచి 3లక్షల 58వేల 974క్వింటాళ్లు, 6002 మంది రైతుల నుంచి లక్షా 155 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశామన్నారు. పంటల సాగు కోసం ప్రాజెక్టు ల నిర్మాణం చేపట్టి మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయడం, చనకా-కోర్టా బ్యారేజీ నిర్మాణం ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాలు చేపడుతోందన్నారు.  

విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తూనే.. విద్యా రంగాన్ని సైతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందనిన్నారు. జిల్లాలో ప్రజ లకు మెరుగైన వైద్యం కోసం ఆదిలబాద్‌ రిమ్స్‌, ఉట్నూర్‌ కమ్యూనిటీ ఆసుపత్రు లలో ఇప్పటి 795 మంది డయాలసిస్‌ చేసుకోవడం జరిగిందన్నారు. కొవిడ్‌ వల్ల ఆరోగ్య సిబ్బంది ఒకరు మరణించడంతో రూ.50 లక్షలు, కొవిడ్‌తో మరణించిన 200మందికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశామన్నారు. అలా గే, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు 172 గిరిజన గ్రామాల్లో 40వేల 429 దోమ తెరలు పంపిణీ చేశామని, అవ్వాల్‌ వాహనాల ద్వారా 27వేల 983 అత్యవసర కేసులకు వైద్య చికిత్సల కోసం రవాణా సౌకర్యం కల్పించామ న్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో రూ.150 కోట్లతో నిర్మితమైన రిమ్స్‌ ఆసుపత్రికి ప్రజల ఆరోగ్య స మస్యలను దృష్టిలో ఉంచుకుని రూ.11.65 కోట్లతో ఎంఆర్‌ఐ యూనిట్‌ను మం జూరు చేశామన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో విద్యా రంగంపై ప్రత్యేకదృష్టి సారించడంతో అన్నివర్గాల విద్యార్థులకు మెరుగైన ఇంగ్లీష్‌ మీడియం చదువులను అందించేందుకు రెసిడెన్షియల్‌, గురుకుల పాఠశాలలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిందన్నారు.  ఈయేడు జిల్లాలో ఇప్పటి వరకు విద్యా ర్థులకు 4లక్షల 85వేల పాఠ్య పుస్తకాలను అందజేశామని, అలాగే బడి బాట కార్యక్రమం కింద 2738మందిని పాఠశాలలో చేర్పించగా, మొదటి విడతలో 237 పాఠశాలల్లో 228 పనులకు అనుమతులు మంజూరు చేశామన్నారు.

ప్రతీ కుటుంబానికి ఆర్థిక చేయూత

ప్రతీ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు కులాల వారీగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ వారి ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తోంది. కులాల వారీగా ఆర్థిక చేయూత ను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇందులో దళితుల కు దళితబస్తీ, దళితబంధు, గొల్లకుర్మలకు జీవాల పంపిణీ, మత్స్యకారుల కు టుంబాలకు, చిరు వ్యాపారులకు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు, అల్పసంఖ్యాక వర్గాలకు స్కాలర్‌షిప్‌లు, అర్హులైన వారికి సబ్సిడీ రు ణాలు అందిస్తోందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో పాటు ఆసరా పింఛన్లు అందజేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 15వేల 474 మందికి  పింఛన్లు అందనున్నాయన్నారు. యువతకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణ సదుపాయం అందిస్తోందని, అలాగే ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణు లు, బాలింతలకు ఒకపూట సంపూర్ణ ఆహారం వంటి అనేక కార్యక్రమలు తీసుకుని ముందుకు సాగుతు న్నామన్నారు. వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆది లాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆహార భద్రత కార్డులను కూడా కొత్తగా మంజూరు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో లక్షా 92వేల 756 ఆహార భద్రత కార్డు దారులకు ప్రతీ నెల 966 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని సంక్షేమ పథకాలను వివరించారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట

జిల్లావ్యాప్తంగా యువత పెడతోవ పట్టకుండా వారిని సన్మార్గంలో నడిపించేం దుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందుకు పోలీసు శాఖ ద్వారా గుడుంబా, గంజా, పేకాట, మట్కా వంటి అనేక అసాంఘిక కార్య కలాపాలను నిర్మూలించేందుకు పోలీసులు కృషి చేస్తు న్నారని పేర్కొన్నారు. జిల్లాను ప్రగతి పథంలో తీసు కెళ్లడానికి పోలీసు వారు సైతం అహర్నిశలు ప్రజా రక్షణకు అంకితమవుతున్నారని అన్నారు. 

గిరిజన పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన 

పంద్రాగస్టు వేడుకల్లో ఐటీడీఏ పీవో  వరుణ్‌రెడ్డి 

ఉట్నూర్‌: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధ న ప్రారంభించడం జరిగిందని, గిరిజన యువత విద్య, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కర్నా టే వరుణ్‌రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్స వం పురస్కరించుకోని స్థానిక ఐటీడీఏ కా ర్యాలయం ఆవరణలో  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు.  కాగా, ఉట్నూర్‌ కేంద్రంగా ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుంటున్న గిరి జన విద్యార్థులు స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో ప్రద ర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గిరిజన విద్యార్థులు గుస్సా డి నృత్యం చేశారు. అలాగే, పీవో వరుణ్‌రెడ్డి, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌ లక్కెరావు, డీడీ దిలీప్‌కుమార్‌, ఆర్సీవో గంగాధర్‌లు గుస్సాడీ టోపీలు ధరించారు. 

Updated Date - 2022-08-16T06:55:36+05:30 IST