మామడను సందర్శించిన ఆర్డీవో

ABN , First Publish Date - 2022-07-19T03:40:57+05:30 IST

వేమనపల్లి మండలం నీల్వాయి పంచాయతీ పరిధిలోని మామడ గ్రామం నీల్వాయి ప్రాజెక్టు నీటితో ముంపునకు గురవుతోంది. మామడ గ్రామాన్ని సోమ వారం బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి ట్రాక్టర్‌లో వెళ్లి పరిశీ లించారు. నీల్వాయి కట్ట కింద గ్రామం ఉండడంతో వర్షాకా లంలో ఇండ్లలోకి నీటి ఊటలు వస్తున్నాయి.

మామడను సందర్శించిన ఆర్డీవో
మామడ గ్రామానికి ట్రాక్టర్‌లో వెళ్తున్న ఆర్డీవో శ్యామలాదేవి

వేమనపల్లి, జూలై 18: వేమనపల్లి మండలం నీల్వాయి పంచాయతీ పరిధిలోని మామడ గ్రామం నీల్వాయి ప్రాజెక్టు నీటితో ముంపునకు గురవుతోంది. మామడ గ్రామాన్ని సోమ వారం బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి ట్రాక్టర్‌లో వెళ్లి పరిశీ లించారు. నీల్వాయి కట్ట కింద గ్రామం ఉండడంతో వర్షాకా లంలో ఇండ్లలోకి నీటి ఊటలు వస్తున్నాయి. గ్రామస్థులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామస్థులను  అధికారులు నీల్వాయి కస్తూర్బా విద్యాలయంలో పునరావాసం కల్పించారు. ఈ నేపధ్యంలో ఆర్డీవో శ్యామలాదేవి మామడ గ్రామానికి చేరుకుని అక్కడ పరిస్థితులను పరిశీలించారు.  ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గ్రామస్థు లకు ప్రాజెక్టుతో ముప్పు పొంచి ఉందన్నారు. వేరే చోట ఇండ్ల స్థలాలు కేటాయించి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూర య్యేలా ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఆర్డీవో తెలిపారు. తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో లక్ష్మయ్య, స్ధానిక సర్పంచు గాలి మధు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. 

Read more