జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం

ABN , First Publish Date - 2022-09-19T05:42:12+05:30 IST

జిల్లాలో ఆదివారం ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా 18.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా భైంసా మండలంలో అత్య ధికంగా 54.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడెం ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697.800లకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.039 టీఎంసీలకు చేరింది

జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం

నిర్మల్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా 18.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా భైంసా మండలంలో అత్య ధికంగా 54.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడెం ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697.800లకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.039 టీఎంసీలకు చేరింది. ప్రా జెక్టులోకి 3051 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఒక గేటు ఎత్తి 4754 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీట ర్లు కాగా ప్రస్తుతం 358.70 మీటర్లకు చేరింది. నీటి సామర్థ్యం 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.852 టీఎంసీలకు చేరింది. 760 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఒక గేటును ఎత్తి 760 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. 

స్వర్ణ ప్రాజెక్టు గేటు ఎత్తివేత

సారంగాపూర్‌: ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో ఆదివా రం కురిసిన భారీ వర్షానికి స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. పూర్తిస్థాయి సామర్థ్యం 1183 అడుగులకు గాను 1183 అడుగులకు నీరు వచ్చి చేరడంతో ఒక గేటును ఎత్తి 2500 క్యూసెక్కుల నీరును దిగువకు వదిలిపెట్టారు. ప్రస్తుతం 2500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 

1510 క్యూసెక్కుల నీటి విడుదల

భైంసా: మహారాష్ట్రలో కురిసిన వర్షానికి గడ్డెన్న వాగు ప్రా జెక్టులోకి ఇన్‌ఫ్లో రావడం ప్రారంభం అయింది. ప్రాజెక్టు నిర్వ హణ అధికారులు పరిస్థితిని సమీక్షించి ఆదివారం ఉదయం ఒక వరద గేటును రెండు మీటర్ల మేర ఎత్తి సుద్దవాగులోకి 1510 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సమయంలో ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 358.7 మీటర్ల తో నిండుకుండను తలపిస్తోంది.

Updated Date - 2022-09-19T05:42:12+05:30 IST