పూలాజీ బాబా ధ్యాన కేంద్ర వార్షికోత్సవం
ABN , First Publish Date - 2022-01-31T04:03:25+05:30 IST
మండలంలోని బెల్గాం గ్రామంలో పూలాజీబాబా ధ్యానకేంద్ర వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అరిగెల నాగే శ్వర్‌రావు, బాబా కుమారుడు కేశవరావు బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 30: మండలంలోని బెల్గాం గ్రామంలో పూలాజీబాబా ధ్యానకేంద్ర వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అరిగెల నాగే శ్వర్‌రావు, బాబా కుమారుడు కేశవరావు బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్మల్‌కు చెందిన కమల ఈశ్వర్ నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, నాయకులు శ్రీనివాస్, నాజీర్, ధ్యాన కేంద్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.