రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలం

ABN , First Publish Date - 2022-09-29T06:01:56+05:30 IST

రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. బుధవారం మావల మండ లంలోని బట్టిసావర్గం పరిధిలోని రాజీవ్‌ స్వగృహ ప్లాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల విస్తీర్ణం 28.37 ఎక రాల్లో 362 ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, బహిరంగవేలం వేయడానికి డైరెక్టర్‌ టౌన్‌, కంట్రీ ప్లానింగ్‌ అనుమతులు రావడం

రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలం
ప్లాట్ల వివరాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ప్లాట్ల స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ 

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 28: రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. బుధవారం మావల మండ లంలోని బట్టిసావర్గం పరిధిలోని రాజీవ్‌ స్వగృహ ప్లాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల విస్తీర్ణం 28.37 ఎక రాల్లో 362 ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, బహిరంగవేలం వేయడానికి డైరెక్టర్‌ టౌన్‌, కంట్రీ ప్లానింగ్‌ అనుమతులు రావడం జరిగిందని తెలిపారు. ప్లాట్ల లో అంతర్గత రోడ్లు, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, అంతర్గత పనులు వారం రోజుల్లోగా పూర్తి చేసి బహిరంగ వేలానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, రాజస్వ మం డల అధికారి రమేష్‌, రాథోడ్‌, మావల తహసీల్దార్‌ వనజరెడ్డి, మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సాయికిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

భూముల సర్వేను సమన్వయంతో నిర్వహించాలి

భూముల సర్వేను సంబంధిత శాఖల సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి భూ సర్వే నిర్వహణపై రెవెన్యూ, అటవీ, పంచాయితీ శాఖల అధికారులతో జుమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని గ్రా మాల్లో భూ సర్వేను ఆయా మండలాల తహసీల్దార్లు, పంచాయితీ కార్యదర్శులు, అవీ శాఖ సిబ్బంది సహకారంతో నిర్వహించాలని అన్నారు. ఇప్పటికే గత వారం లో జిల్లా కేంద్రంలో అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామనితెలిపారు. ఆయా శిక్షణ మేరకు క్షేత్ర స్థాయిలో సమిష్టిగా భూముల సర్వేను నిర్వహించాల ని అన్నారు. సర్వేలకు సంబంధించిన వివరాలను రికార్డు చేసుకోవాలని సూచిం చారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు ఎన్‌.నటరాజ్‌, రిజ్వాన్‌ బాషా షేక్‌ పాల్గొన్నారు.

సకాలంలో రికార్డులు క్రోడీకరించాలి

బేల: ఉపాధి హామీ రికార్డులను సకాలంలో క్రోడీకరించాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశించారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఈజీఎస్‌ పనుల వివరాలు, రికార్డులను కలెక్టర్‌ పరిశీలిం చారు. ధీనిలో భాగంగా కూలీలకు సంబంధించిన బ్యాంకు ఖాతా ఆన్‌లైన్‌ నమో దు చేయడాన్ని కలెక్టర్‌ వాకబు చేశారు. కూలీలకు ఉపాధి డబ్బులు అందక పోవడాన్ని సంబంధిత అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో కూలీలకు డబ్బులు అందేవిధంగా చూడాలని పీడీ కిషన్‌కు ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేందాన్ని పరిశీలించారు. తాత్కాలిక ఆరోగ్య కేంద్రం మరమ్మతు పనుల కోసం నిధులు మంజూరు చేయాలని మండల పరిషత్‌ అధ్యక్షురాలు వనితఠాక్రె కోరగా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు.

Updated Date - 2022-09-29T06:01:56+05:30 IST