రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన
ABN , First Publish Date - 2022-07-13T04:34:27+05:30 IST
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు క్వింటాలు బియ్యానికి రూ.440 కమీషన్ చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆసిఫాబాద్, జూలై 12: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు క్వింటాలు బియ్యానికి రూ.440 కమీషన్ చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్వో స్వామికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కేశవ్, శేషగిరిరావ్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.