జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై నిరసన

ABN , First Publish Date - 2022-09-19T05:53:36+05:30 IST

తెలంగాణ విమోచన దినాన్ని నీరుగార్చేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించడం అమరుల త్యాగాలను అవమానించడమేనని బీజేపీ నాయకులు జోగురవి అన్నారు.

జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై నిరసన

ఆదిలాబాద్‌అర్బన్‌, సెప్టెంబరు 18: తెలంగాణ విమోచన దినాన్ని నీరుగార్చేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించడం అమరుల త్యాగాలను అవమానించడమేనని బీజేపీ నాయకులు జోగురవి అన్నారు. జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో వినాయక్‌చౌక్‌లో నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోగురవి మాట్లాడుతూ రజాకార్ల పార్టీ ఎంఐఎంకు భయపడి విమోచన దినంగా కాకుండా సమైక్యత దినం నిర్వహించారని మండిపడ్డారు. చరిత్రను, రజాకార్ల ఆకృత్యాలను మరిచి పోయారన్నారు. తెలంగాణ ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన వందల ఘటనలు, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో తెలంగాణ విమోచ దినం నిర్వహించాలని బీజేపీ ఏళ్లుగా పోరాటం చేసినప్పటికి, ప్రభుత్వం అడ్డుపడిందని కలెక్టర్‌ కార్యా లయంపై జాతీయజెండాను ఎగుర వేసి జైలుకు సైతం వెళ్లామన్నారు. ధర్నా లో పట్టణ నాయకులు లాలామున్నా, దినేష్‌ మటోలియా, సోమరవి, సుభాస్‌, వేద వ్యాస్‌, ముకుంద్‌రావ్‌, మయూర్‌చంద్ర, రాజేశ్‌, విజయ్‌, భీమ్‌సేన్‌రెడ్డి, నగేష్‌రెడ్డి, రాజన్న, రవిరెడ్డి, సాయి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-19T05:53:36+05:30 IST