ప్రాణహిత పుష్కర ఘాట్లను అభివృద్ధిపర్చాలి
ABN , First Publish Date - 2022-02-21T04:04:39+05:30 IST
ఏప్రిల్ 13నుంచి 24 వరకు ప్రాణ హిత పుష్కరాలు జరగనున్న నేప థ్యంలో చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత పుష్కర ఘాట్లను అభివృద్ధిపర్చాలని ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని గూడెం గ్రామ సమీపంలోని ప్రాణ హిత నదిని ఆయన సందర్శించారు.
- ఎంపీ సోయం బాపూరావు
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 20: ఏప్రిల్ 13నుంచి 24 వరకు ప్రాణ హిత పుష్కరాలు జరగనున్న నేప థ్యంలో చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత పుష్కర ఘాట్లను అభివృద్ధిపర్చాలని ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని గూడెం గ్రామ సమీపంలోని ప్రాణ హిత నదిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్క రాలకు రెండునెలల సమయం కూడా లేనందున వెంటనే ఘాట్ల అభివృద్ధిని నిధులు మంజూరు చేసి పనులు ప్రారం భించాలన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ హరీష్‌బాబు మాట్లాడుతూ పుష్కర ఘాట్ల అభివృద్ధి విషయంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోనప్ప నిర ్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాయకులు సిద్ధంశెట్టి సుహాసిని, జేబీ పౌడెల్, సత్యనారా యణ, వీరభద్ర చారి, ఆత్మారాంనాయక్, వెంకటేష్, చిన్నన్న, శ్రీశైలం, సర్పంచ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.