రాత్రిపూట తూకాలు చేయాలేమంటూ హమాలీల ఆందోళన

ABN , First Publish Date - 2022-10-28T01:28:38+05:30 IST

భైంసా వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్న సరుకులను రాత్రిపూట తూకాలు చేయలేమంటూ హమాలీలు గురువారం రాత్రి ఆందో ళన చేపట్టారు.

రాత్రిపూట తూకాలు చేయాలేమంటూ హమాలీల ఆందోళన
నిరసనలకు దిగిన హమాలీలు

భైంసా,అక్టోబరు 27 : భైంసా వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్న సరుకులను రాత్రిపూట తూకాలు చేయలేమంటూ హమాలీలు గురువారం రాత్రి ఆందో ళన చేపట్టారు. స్థానిక మార్కెట్‌ కమిటీకి గురువారం ఒక్కరోజే 825 మంది రైతులు సోయా, మొక్కజొన్న దిగుబడులను విక్రయానికి తీసుకురావడంతో గ్రీన్‌మార్కెట్‌ యార్డు అంతా సరుకులతో నిండిపోయింది. దీనికి తోడు ధరల ఖరారు ప్రక్రియ సాయంత్రం ఐదుగంటలకు పూర్తయింది. దీంతో అధిక మొత్తంలోనున్న దిగుబడులను తూకం వేయాలంటే వేకువ జాము అవతుందని హమాలీలు పేర్కుంటూ తూకం వేయ కుండా నిరసనకు దిగారు. శుక్రవారం ఉదయం వేళలలో తూకం ప్రక్రియ చేపడతామంటూ గ్రీన్‌మార్కెట్‌ యార్డు నుంచి వ్యవ సాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ క్రమం లో తూకాలను చేపట్టాలంటూ రైతులు మరోమారు ఆందోళన ప్రారంభించారు. పరిస్థితి తీవ్రతరం అవుతుండడాన్ని గుర్తించిన మార్కెట్‌ కమిటీ అధికారులు రాత్రి 7గంటల ప్రాంతంలో హమాలీలను సముదాయించి తూకాలను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టారు.

నేడు గ్రీన్‌మార్కెట్‌ బీట్‌బంద్‌

అధికమొత్తంలోనున్న వ్యవసాయ ఉత్పత్తులతో గ్రీన్‌మార్కెట్‌ యార్డు నిండిపోయిన నేపథ్యంలో శుక్రవారం బీట్‌ను బంద్‌ చేస్తు న్నట్లుగా మార్కెట్‌ కమిటీ అధికారులు వెల్లడించారు. గురువారం రైతులు తీసుకువచ్చిన వ్యవసాయోత్పత్తులను శుక్రవారం వరకు తూకం జరుగనున్నందున బీట్‌ను నిర్వహించలేక పోతున్నట్లుగా మార్కెట్‌ కమిటీ అధికారులు వెల్లడించారు. తిరిగి శనివారం బీట్‌ యధావిధిగా కొనసాగుతుందని మార్కెట్‌ కమిటీ అధికారులు పేర్కొన్నారు. రైతులు ఇట్టి విషయాన్ని గుర్తించి సహకరించాలని విజ్ఙప్తి చేశారు.

తూకంలో ఆలస్యంపై రైతుల ఆందోళన

ఆరుగాలం శ్రమించిన వ్యవసాయోత్పత్తులను విక్రయిం చేందుకు గాను మార్కెట్‌కు తీసుకువస్తే తూకంలో జాప్యం చేయడం ఎందుకని నిరసిస్తూ భైంసా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఇక్కడి మార్కెట్‌ గ్రీన్‌మార్కెట్‌ యార్డుకు 825 మంది రైతులు సోయా, మొక్కజొన్నల దిగుబడులను విక్రయించేందుకు వచ్చారు. అధికమొత్తంలో దిగుబడులు రావడంతో బీట్‌ ప్రారం భించడం, ధరల ఖరారు, తూకంలో జాప్యం జరిగింది. సాయంత్రం వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల విక్ర యానికి వచ్చిన రైతులు అ ధికారుల తీరు, తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందో ళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యా లయాన్ని ముట్టడించి నిరస న చేపట్టారు. రాత్రి సరుకుల చోరీ జరుగుతుందని రైతులు ఆరోపించారు.

Updated Date - 2022-10-28T01:28:40+05:30 IST