రాజకీయ కోలాహలం

ABN , First Publish Date - 2022-04-06T03:53:31+05:30 IST

రాజకీయ పార్టీల ఆందోళనలు, నిరసనలు ధర్నాలతో జిల్లా అం తటా రాజకీయ కోలాహలం మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో సహా ప్రధాన విపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు కూడా పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండడంతో ప్రస్తుతం జిల్లాలో రాజకీయ వాతావ రణం వేడెక్కింది.

రాజకీయ కోలాహలం
లోగో

- జిల్లాలో పోటా పోటీగా ఆందోళనలు
- కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార పార్టీ ధర్నాలు
- ప్రాణహిత పేరిట బీజేపీ జలసాధన యాత్ర
- పెట్రోలు, విద్యుత్‌ చార్జీల పెంపుపై కాంగ్రెస్‌ నిరసన
- ప్రజల్లోకి వెళ్లడమే ప్రధాన లక్ష్యంగా భావిస్తున్న విశ్లేషకులు

     (ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)
రాజకీయ పార్టీల ఆందోళనలు, నిరసనలు ధర్నాలతో జిల్లా అం తటా రాజకీయ కోలాహలం మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో సహా ప్రధాన విపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు కూడా పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండడంతో ప్రస్తుతం జిల్లాలో రాజకీయ వాతావ రణం వేడెక్కింది. ఉత్తరాది ఎన్నికల తర్వాత ముందస్తు ఊహగానాలపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అధికార విపక్షాలు పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుం డడం చర్చనీయాం శంగా మారింది. అయితే పైకి నిరసనలు, ధర్నా కార్యక్రమాలుగా కన్పిస్తున్నా అసలు ఉద్దేశ్యం ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల నాటికి పరిస్థితులను తమకు సానుకూలంగా మలుచుకునే ప్రయ త్నాలు చేస్తున్నారనేది రాజకీయ పరిశీకుల అంచనా. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో అధికార పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడు తుండడం ఒకింత విస్మయానికి గురి చేస్తున్నా అసలు ఉద్దేశ్యం టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిని మరల్చేందుకేన న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రెండ్రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలపై కేంద్ర వైఖరిని నిరసించే పేరిట ధర్నాలు నిర్వహించింది. తిరిగి బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా మరో సారి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది.

-అధికార పార్టీకి దీటుగా..
మరో వైపు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ కూడా తానేమి తక్కువ తినలేదన్నట్టుగా అధికార పార్టీకి దీటుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం  కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అలా గే ఏప్రిల్‌ 7న హైదరాబాద్‌లో విద్యుత్‌సౌధ పౌరసరఫరా శాఖ కార్యాల యం ముందు నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా, జిల్లాలో బలపడేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళనకు సిద్దమైంది. ఇందులో భాగంగా మద్యం, మత్తు వ్యాపారాలపై సమర శంఖం పేరిట నిరసన కార్యక్రమాలను రూప కల్పన చేసింది. సిర్పూరు నియోజకవర్గంలో ఆ పార్టీ నేత డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు ప్రాణ హిత ప్రాజెక్టు నిర్మించాలనే డిమాండుతో కాగజ్‌నగర్‌ నుంచి తుమ్డిహే ట్టి వరకు ప్రాణహిత జల సాధన పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా రు. గడిచిన మూడు రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఈ నెల 7 వరకు కొనసాగించి తుమ్డిహేట్టి వద్ద నిరసనతో కార్యక్రమాన్ని ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- పోటీపోటీగా..
ప్రస్తుతం ఎన్నికలు, ఇతర రాజకీయ ప్రాధాన్య అంశాలు లేక  పోయినా అధికార, విపక్షాలు పోటా పోటీగా ధర్నాలు, ఆందోళనలు నిర సన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఆయా పార్టీల ప్రధాన లక్ష్యం ప్రజల్లోకి వెళ్లి తమ వైపుకు ఎలా తిప్పుకోవాలన్న సంకల్పమే  కన్పిస్తోం ది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగి పోయింది. ముఖ్యంగా రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా తెచ్చిన ‘ధరణి’ సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. గ్రామీణ ప్రజల, భూ యాజమానుల తీవ్రంగా ప్రభావితం చేసింది. అంతేకాదు ధరణిలో రాష్ట్రంలోనే అత్యధికంగా వివాదాస్పద భూముల జాబితా ఈ జిల్లాలో ఉండడం కూడా  ఇక్కడి ప్రజల్లో అధికార పార్టీల పట్ల ప్రతి కూల పరిస్థితులకు కారణమవుతోంది. ఈ పరిమాణాలతో పాటు నాయకుల ప్రవర్తన కింద స్థాయి నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి అధికార పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించిందని చెప్పా లి. ఈ క్రమంలో ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) బృందాలు జిల్లాలో మూడు దఫాలుగా చేపట్టిన సర్వేలో అధికార పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తేటతెల్లం  అయింది. రాష్ట్రంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితులున్నట్టు తేలినందునే పార్టీ రాష్ట్ర నాయకత్వం డ్యామేజీని కంట్రోల్‌ చేసుకునేం దుకు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్న అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

- ఉద్యమ కార్యాచరణ..
 ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ జిల్లా పార్టీల అధ్యక్షుల ప్రకటన, ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసి ఎమ్మెల్యేలు పార్టీ ప్రజాప్రతి నిధులను ప్రజల్లోకి వెళ్లి తరుచూ కలుస్తు ఉండాలని అధిష్ఠానం సూచించినట్టు సమా చారం. కాగా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉన్నప్పటికీ నాయకత్వ లోపం ప్రధాన సమస్యగా మారింది. రెండు నియోజకవర్గాల్లోనూ ఇన్‌చార్జిలు ఎవరో కూడా తెలియని పరిస్థితి కొనసాగుతున్నది. అయినప్పటికీ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుండడం ఆ పార్టీకి ఇంకా మిగిలి ఉన్న బలానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రస్తుతం విశ్వప్రసాద్‌ రావు డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంత కాలంగా ఆయన క్రీయశీలకంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాలు న్నాయి. అయితే పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ఆర్థిక భారమంతా తనపై పడుతున్నందునే ఆయన తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పార్టీ హైకమాండ్‌ను పదే పదే కోరుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పారీ ్టలో అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా రాష్ట్ర నాయకత్వం నిర్వహించే కార్యక్రమాలను మాత్రం ద్వితీయా శ్రేణి నాయకులు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టును ఆశిస్తున్న నేత లు ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపడుతుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు బీజేపీ నాయకులు గడిచిన ఏడాది కాలంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవ ల జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను కొత్త వ్యక్తికి పార్టీ అప్పగించింది. ఈ మూడు పార్టీలు కూడా డిసెంబరు లోపు ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాతోనే పోటా పోటీగా ప్రజల్లోకి వెళ్లుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-04-06T03:53:31+05:30 IST